Prabhas-Mahesh: ప్రభాస్ స్పీడ్ కు మహేష్ బ్రేకులు.. సూపర్ స్టార్ క్రేజ్ కు ప్రూఫ్ ఇదే!

Prabhas-Mahesh: మన తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు వాళ్ళ ఫ్యాన్స్ వీరాభిమానాన్ని ఎవరూ తట్టుకోలేరు. బాబు కూడా ఏదో సాదాసీదాగా రాకుండా వస్తూ వస్తూనే ఉన్న రికార్డ్లు అన్నిటిని పక్కకు నెట్టేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసే స్థాయిలోనే దిగుతాడు.

 

ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేటట్టుగా ఈసారి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాతో పాత రికార్డులు అన్నిటిని పక్కకు నెట్టేసాడు మహేష్ బాబు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం సినిమా 2024 జాన్ 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు. మొన్న మొన్ననే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో విడుదల అయ్యి ఒక కొత్త రికార్డుని సృష్టించింది.

ఇలా విడుదల అయిందో లేదో లెక్కపెట్టలేనన్ని వ్యూస్ వస్తూనే ఉన్నాయి. కేవలం 24 గంటల్లోనే ఏకంగా 39 మిలియన్ వ్యూ లను సంపాదించుకుంది ఈ ట్రైలర్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ 32.6 మిలియన్ వ్యూస్ తో హైయెస్ట్ వ్యూస్ ఇన్ ఏ డే అనే రికార్డుని ఉంచుకుంది. అయితే దానిని కూడా పక్కకు నెట్టేసి బాబు ఏకంగా 39 మిలియన్ల వ్యూస్ తో ముందంజలో ఉన్నాడు.

 

ఏ రికార్డులైనా మహేష్ బాబు వచ్చేంత వరకే, వస్తూ వస్తూనే అన్ని లేపేస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తూ చూస్తూనే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కుటుంబం అందరితో కలిసి సంక్రాంతికి హాయిగా థియేటర్లలో చూసుకోవచ్చు అని తెలుస్తుంది. మరి బాబు వచ్చాడు అంటే కచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే కదా. ఈ సంవత్సరం సంక్రాంతికి కుటుంబం అందరితో కలిసి థియేటర్లలో చూడడానికి బాబు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని దింపుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -