తగ్గేదేలే అంటూ చెప్పుతో దాడి చేసిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో!

సాధారణంగా నేషనల్ హైవే పై ప్రయాణం చేస్తున్నప్పుడు మనం టోల్ ప్లాజా వద్ద టోల్ ఛార్జ్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క వాహనానికి తప్పనిసరిగా టోల్ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే టోల్ ఛార్జ్ కట్టమన్నందుకు ఓ వ్యక్తి టోల్ ప్లాజాలో ఉన్నటువంటి యువతిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా తనపై చేయి చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌ రాజ్‌ఘడ్‌-భోపాల్‌ కచ్‌నారియా టోల్‌ప్లాజా వద్ద శనివారం జరిగిన ఈ ఘటనలో భాగంగా రాజ్‌కుమార్‌ గుజార్‌ అనే వ్యక్తి తన కారుకు ఫాస్ట్‌ట్యాగ్‌ లేకుండానే అక్కడికి వచ్చాడు. టోల్ ఛార్జ్ చెల్లించమంటే తాను స్థానికుడని టోల్ ఛార్జ్ నుంచి తనకు మినహాయింపు ఉందని, అలాగే టోల్ ప్లాజా నిర్వాహకుడు తనుకు తెలిసిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. అయితే టోల్ ప్లాజా నిర్వాహకుడు తను ఎవరో తెలియదని చెప్పేసరికి ఆ యువతి టోల్ చార్జర్ చెల్లించాల్సిందేనని చెప్పింది.

ఈ విధంగా టోల్ ఛార్జ్ అడగడంతో రాజ్ కుమార్ ఆ యువతిపై దుర్భాషలాడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారు. అయితే ఆ యువతి ఏమాత్రం తగ్గకుండా వెంటనే తన చెప్పు తీసుకొని ఆ వ్యక్తిపై దారుణంగా దాడి చేసింది. అక్కడికి ఆ వ్యక్తిని అడ్డుకోవడం కోసం అక్కడున్న వారు ప్రయత్నం చేసినప్పటికీ అతను దాడి చేశారు. ఆ యువతి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా చెప్పుతో ఆ వ్యక్తిపై దాడి చేసింది.

ఇలా ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నప్పటికీ అక్కడ సిబ్బంది తప్ప సెక్యూరిటీ వచ్చి ఏమాత్రం ఈ గొడవను అడ్డుకోలేదు. ఇకపోతే అక్కడ మరొక మహిళా సిబ్బంది ఈ గొడవను ఆపే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈ గొడవకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియో ఆధారంగా మహిళా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారే తప్పా ఇప్పటికి ఆ యువతిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయలేదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -