MP Raghu Rama Krishna: రఘురామ కృష్ణంరాజుకు మరో షాక్ తగిలిందా.. ఏమైందంటే?

MP Raghu Rama Krishna: వైఎస్ఆర్సిపి పార్టీ హయాంలో తప్పు చేసినటువంటి ఏ ఒక్క నాయకుడు ముందు రోజుల్లో ప్రశాంతంగా ఉండే దాఖలాలు కనిపించడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు విషయంలో ఆయనకు మరో షాక్ తగిలిందని చెప్పాలి. గతంలో ఈయన విషయంలో
సీఐడీ అధికారులు కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

గతంలో రఘురామకృష్ణం రాజును పోలీసులు అరెస్టు చేసి ఒకరోజు రాత్రి మొత్తం కస్టడీలో ఉంచడం అలాగే తదుపరి రోజున కోర్టుకు హాజరు పరచడం జరిగింది. అయితే ఈయన కాల్ డేటా మొత్తం భద్రపరచాలని సిబిఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.నిజానికి అయితే ఈ కేసు ఇప్పటివరకు సిబిఐకి అప్పగించకపోయిన టెలికాం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల వరకు మాత్రమే కాల్ డేటా భద్రపరుచుతారని తక్షణం ఆ కాల్ డేటాను జాగ్రత్తపరచాలని రఘురామకృష్ణ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు.

 

రఘురామకృష్ణం రాజు కేసును సీఐడీ తీసుకుంటే చాలని.. సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదనలు వినిపించారు. పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే… అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ కాల్ డేటాను సేకరించాలని ఆదేశించింది.అయితే ఇప్పటివరకు ఈ కేసును సిబిఐకి అప్పగించాలా వద్దా అనే విషయంపై కోర్టు ఉత్తర్వులు ఇవ్వకపోయినప్పటికీ కాల్ డేటాని మాత్రం భద్రపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది.

 

అయితే ఈ కేసు విచారణ వేసవి సెలవుల అనంతరం తిరిగి విచారణ జరగబోతుందని కోర్టు తీర్పు వెల్లడించింది.గత రెండు సంవత్సరాల క్రితం రఘురామ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలోనే పోలీసులు తనని అరెస్టు చేసి ఒకరోజు రాత్రి మొత్తం కస్టడీలో ఉంచారు. అయితే ఆరోజు రాత్రి తనని సిఐడి అధికారులు చాలా తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణ ఆరోపణలు చేశారు. అయితే తనని కొట్టారన్నట్టు మిలిటరీ ఆస్పత్రి నివేదికలో కూడా నిర్ధారణ అయింది అయితే ఈ కేసు ఇంకా ఇప్పటికి పూర్తి కాలేదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -