Manchu Manoj: భూమా మౌనికని పెళ్లి చేసుకోనున్న మంచు మనోజ్.. అసలు నిజం ఏంటంటే?

Manchu Manoj: తెలుగు ప్రేక్షకులకు మోహన్ బాబు రెండవ కొడుకు మంచు మనోజ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన మనోజ్. తొలి సినిమాతోనే నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బిందాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.

అంతేకాకుండా ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జ్యూరీ పురస్కారాన్ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన రాజు భాయ్ తో మనోజ్ లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అనంతరం పలు సినిమాల్లో మనోజ్ నటించినప్పటికీ.. ఆ సినిమాలతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా మంచు మనోజ్ రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అదేమిటంటే.. కర్నూలు జిల్లాలోని ఒక రాజకీయ కుటుంబానికి చెందిన యువతిని మంచి మనోజ్ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆమె పేరు మౌనిక రెడ్డి.. ఇక తల్లిదండ్రుల విషయానికొస్తే దివంగత భూమారెడ్డి, శోభా దంపతుల కుమార్తెగా తెలుస్తుంది. ఇక మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక మనోజ్ హైదరాబాదులో గణేష్ మండపం దగ్గర మౌనిక రెడ్డి తో కలిసి పూజలు చేశాడు. ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక మౌనిక మొదటి పెళ్లి విషయానికి వస్తే.. ఆమెకు బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో మొదటి పెళ్లి జరిగిందట. అంతేకాకుండా వీళ్ళిద్దరికీ ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. మనస్పర్ధలు కారణంగా వీళ్ళిద్దరు విడిపోయినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలు వెనక వాస్తవము ఎంతుందో తెలియాలి అంటే.. ఈ విషయం గురించి మనోజ్ స్పందించే వరకు ఎదురు చూడాలి. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -