Manchu Manoj: మనోజ్ ఎమోషనల్ కామెంట్స్.. అక్కపై ప్రేమతో?

Manchu Manoj: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మనోజ్ భూమా మౌనిక రెడ్డిల అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట అదే వార్తల నిజం చేస్తూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో మనోజ్ ,మౌనిక ల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్‌.

అయితే మనోజ్ మౌనికల వివాహ వేడుకను కాస్త గోప్యంగానే ఉంచారు. పెళ్లి అంత సిద్ధమై, ముహుర్తం ఫిక్స్‌ అయ్యేవరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది ఇలా ఉంటే మనోజ్ కి తన అక్క మంచు లక్ష్మి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. అందుకే మనోజ్ బాధ్యతలను తనపై వేసుకొని పెళ్లి పనులు ప్రతి ఒక్కరి కూడా దగ్గరుండి చూసుకుంది మంచు లక్ష్మి. మెహందీ, హెల్ది కి సంబందించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. కాగా మంచు లక్ష్మి అన్ని దగ్గర ఉండి చూసుకోవడంతో తన అక్కని తలుచుకొని తాజాగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు మంచు మనోజ్ తనని పెళ్లి కొడుకు చేస్తున్న మంచు లక్ష్మి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

 

అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌..లవ్‌ యూ అక్క అని రాసుకొచ్చాడు. వివాహ అనంతరం మనోజ్‌ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ పెళ్లి వేడుకలో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. మోహన్‌ బాబు, లక్షి ప్రసన్న, విష్ణు, ఆయన భార్య విరానిక ఇతర కుటుంబ సభ్యులంతా మనోజ్‌తో ఉండి దగ్గరుండి ఈపెళ్లిని జరిపించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ గారు, టి జి వెంకటేష్, కోదండరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు అలాగే ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -