Manchu Manoj: అప్పుడే నెల అంటూ క్యూట్ వీడియో పంచుకున్న మనోజ్.. ఏమైందంటే?

Manchu Manoj: మంచు మనోజ్ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఎప్పుడైతే భూమా మౌనికతో కలిసి బయటకు కనిపించారో అప్పటినుంచి ఈయన గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినపడుతూనే ఉంది. మనోజ్ భూమా మౌనికతో రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు అనుగుణంగానే మనోజ్ భూమా మౌనికను మార్చి మూడవ తేదీ తన అక్క లక్ష్మీ ప్రసన్న ఇంటిలో అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా మనోజ్ భూమా మౌనికల వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వివాహం తర్వాత మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తనకు భూమా మౌనికకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా ఏప్రిల్ మూడవ తేదీ వివాహం జరిగి ఒక నెల పూర్తి కావడంతో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఒక క్యూట్ వీడియోని షేర్ చేశారు. ప్రియా ప్రియా చంపొద్దు అని బ్యాక్గ్రౌండ్ సాంగ్ సెట్ చేశారు.ఇక ఈ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రేమించు… ప్రేమ పంచు.. ప్రేమగా జీవించు అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఇలా మనోజ్ వారి పెళ్లి జరిగి నెలరోజులు పూర్తి అయిన సందర్భంగా తన భార్యతో కలిసి ఉన్నటువంటి ఈ రొమాంటిక్ క్యూట్ వీడియోని షేర్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ దంపతులిద్దరికీ ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. ఇదివరకే పెళ్లిళ్లు చేసుకుని తమ లైఫ్ పార్ట్నర్స్ తో విడిపోయిన ఈ జంట తిరిగి ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -