తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే షాకే!

ప్రస్తుత కాలంలో వ్యాయామం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని కొన్ని వ్యాధులు కేవలం వాకింగ్‌ ద్వారానే నయం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఉదయం, సాయంత్రం పార్కులకు పరుగులు తీస్తున్నారు. గంటల తరబడి పార్కుల్లోనే వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. అయితే వ్యాయామంలో ఓ భాగమైన వాకింగ్‌తో కూడా బహుల ప్రయోజనాలు పొందచ్చని సూచిస్తున్నారు.

చాలా మంది ఉదయం వాకింగ్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే ఆ వాకింగ్‌ ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు. అయితే భోజనం చేసిన తర్వాత చేసే వాకింగ్‌ కూడా చాలా మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. అలా చేయడంతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొందరు భోజనం చేసిన తర్వాత నిద్ర పోతుంటారు. అలా ఎప్పుడు కూడా చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

భోజనం తర్వాత వాకింగ్‌తో కలిగే ప్రయోజనాలు..

భోజనం చేసిన తార్వత నడక చేస్తే జీవక్రియ,జీర్ణక్రియ రేటు మెరుగుపడుతోంది.

2.భోజనం చేసిన తర్వాత నడక సాగిస్తే గుండెకు కూడా చాలా మంచిది.

3. శరీరంలోని కొలెస్ట్రాస్థాయిలు తగ్గిపోతాయి. దాని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు.

4. మనం బరువును తగ్గించుకోవాలంటే శరీరంలో అదనపు కేలరీలను కరిగించడంపై దృష్టి పెట్టాలి.

5. భోజనం తర్వా నడిస్తే ఎక్కువ కేలరీలు బర్న్‌ అవుతాయి. అప్పుడు సునాయసంగా బరువు తగ్గుతోంది.

6. భోజనం తర్వాత వాకింగ్‌ చేస్తే మధుమేహం సైతం నియంత్రణలో ఉండి, బీపీ అదుపులో ఉంటుంది.

7. అందుకే భోజనం చేసిన వెంటనే కూర్చొకూడదు, నిద్రపోరాదు. దాదాపు 15–20 నిమిషాల వరకు నడక సాగిస్తే ఆరోగ్యానికి మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -