Mega Daughter Sushmita: అమ్మాయిల పీరియడ్స్ పై మెగా డాటర్ సుస్మిత ఓపెన్ కామెంట్స్?

Mega Daughter Sushmita: సాధారణంగా మహిళలు తమ నెలసరి పిరియడ్స్ టైం లో ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి ఇలా బాధపడుతుండటమే కాకుండా ఆ పిరియడ్స్ గురించి పక్క వారికి చెప్పడానికి భయపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పీరియడ్స్ టైం నానా రకాలుగా అవమానాలు పడుతూ.. లోపల ఎంతో బాధపడుతూ మహిళలు నెలసరి పిరియడ్స్ ని దాటుకుని వస్తూ ఉంటారు.

అయితే మహిళలు ఇలాంటి ఆలోచనలను దూరం పెట్టాలని, మరింత అవగాహన కల్పించేందుకు మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత ముందు అడుగు వేసింది. పీరియడ్స్ టైం లో ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పిరియడ్స్ గురించి జరిగిన ఒక అవగాహన కార్యక్రమం లో మెగా డాటర్ సుస్మిత పాల్గొంది. ఈ క్రమంలో సుష్మిత మాట్లాడుతూ పీరియడ్స్ మహిళల శరీర అభివృద్ధికి ఉపయోగపడతాయి.

పీరియడ్స్ గురించి మాట్లాడేందుకు ఇంకా సిగ్గుపడుతున్న ఈ రోజుల్లో నేను ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను అని సుస్మిత తెలిపింది. ఇక పీరియడ్స్ గురించి మాట్లాడుకునే విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకంటే లేదని తెలియజేసింది. ఇక మహిళలు పిరియడ్స్ పట్ల అపోహలు తొలగించడానికి అందరూ ఇలా కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని మెగా డాటర్ సుస్మిత ఆ కార్యక్రమంలో తెలిపింది. ఆ క్రమంలో సుప్రియ ఇచ్చిన స్పీచ్ కి అక్కడికి పాల్గొన్న మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఇక తల్లిదండ్రులు పిరియడ్స్ విషయంలో పాజిటివ్ గా తీసుకొని పిల్లలకు మరింత అవగాహన కల్పించాలని తెలిపింది. ప్రస్తుతం సుస్మిత చెప్పినా మాటలు చాలా మంది మహిళలకు ఎంతో ఆనందకరంగా మారాయి. నిజానికి పీరియడ్స్ గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఈ లోకంలో చాలామంది మహిళలకు సుస్మిత తన తోటి మహిళలకు మరో స్థాయిలో ధైర్యం చెప్పింది. ప్రస్తుతం పీరియడ్స్ విషయంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -