VarunTej: నవంబర్లో పెళ్లి పీటలు ఎక్కనున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్?

VarunTej:మెగా కాంపౌండ్ లో త్వరలోనే పెళ్లి భాజలు మోగనున్నాయనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహం ఈ ఏడాది నవంబర్ నెలలో జరుగుతుందని ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనులలో బిజీగా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈయన వివాహం ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తో జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే గతంలో కూడా వరుణ్ తేజ్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి. ఈయన ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం స్పందించి క్లారిటీ ఇచ్చారు. వరుణ్ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.అనంతరం హీరోయిన్ సైతం సోషల్ మీడియా వేదికగా తన గురించి వరుణ్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తవమంటూ చెప్పకనే చెప్పేశారు.

ఇలా వీరిద్దరి విషయం అప్పటితో సుఖాంతం అయినప్పటికీ తాజాగా మరోసారి ఈయన పెళ్లి అంటూ వార్త వైరల్ అవుతుంది.నవంబర్ నెలలోనే ఈయన పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందని మెగా అభిమానులు ఆరా తీస్తున్నారు.అయితే తన పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఇప్పటివరకు మెగా కుటుంబం ఏమాత్రం స్పందించలేదు. అలాగే సదరు హీరోయిన్ కూడా ఈ విషయంపై ఏ విధంగాను స్పందించలేదు. మరి వీరి పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ఈయన గని, ఎఫ్ 3 సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇందులో గని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.ఇక ఎఫ్ 3 సినిమాతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాని తన తండ్రి నాగబాబు స్వయంగా నిర్మించబోతున్నారు.అయితే ఈ సినిమాను ప్రకటించిన అనంతరం ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -