Chiranjeevi-Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ ను చిరంజీవి కాపీ కొట్టారా.. కాపీ కొట్టడం వెనుక అసలు కథ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chiranjeevi-Rajendra Prasad: నట కిరీటి డాక్టర్ గద్దె రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావని ఆ నలుగురు సినిమాలో అడిగిన రఘురాం, నా దేశం నాకేమిచ్చిందని ఆవేశంతో చాలెంజ్ సినిమాలో అడిగిన విద్యార్థి, ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ఎ కింగ్, తిన్నావులే కాజా, ఇలాంటి డైలాగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్, నటనకే మేటి నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఈయన కామెడీ నటుడు మాత్రమే కాదు నవరసాల్ని కూడా పండించగలరు. నవ్వటానికి మామూలు మనుషులు అయితే ఏంటి ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి అని తన సినిమాలతో మన మాజీ ప్రధాని పివి గారిని ఉత్సాహపరిచిన రాజేంద్రప్రసాద్.

తనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇవ్వటానికి పీవీ గారే కారణం అని చెప్పుకుంటారు. అంతటి ఘన చరిత ఉన్న రాజేంద్రప్రసాద్ దగ్గర నటనలో కాపీ కొట్టాను అంటున్నాడు మరొక మహానటుడు. ఒక గొప్ప స్థాయిలో ఉండి ఈ మాట అనటానికి చాలా ధైర్యం ఉండాలి. కానీ నిజం రాజేంద్రప్రసాద్ దగ్గర ఓవర్ డోస్ లేని హాస్యాన్ని పండించడం నేర్చుకున్నాను అంటూ మన మెగాస్టార్ చిరంజీవి చెప్పటం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి చెప్పుకొచ్చారు.చిరంజీవి డాన్సులకి ఫైట్లకి ఎంతమంది అభిమానులు ఉంటారో కామెడీకి కూడా అంతేమంది అభిమానులు ఉంటారు. అంతే కామెడీని పండించే విషయంలో అగ్ర హీరో అయినటువంటి రాజేంద్రప్రసాద్ అప్పట్లో స్ఫూర్తిగా నిలిచాడు. కామెడీలో ఓవర్డోస్ లేకుండా సీన్లు పండించడం అనేది రాజేంద్రప్రసాద్ దగ్గర నుంచి నేర్చుకున్నారట చిరంజీవి. చిరంజీవి నటన గురించి మనందరికీ తెలిసిందే.

నవరసాలను అలవోకగా పండించగలిగే చిరంజీవి, సినీ ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజుగా వెలిగిన చిరంజీవి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం రాజేంద్రప్రసాద్ గౌరవాన్నిమరింత పెంచడమే అవుతుంది. ఇక ఈ ఇద్దరు మేటి నటులు కలిసి చాలా సినిమాలలో నటించారు. ఏదైనా ఒక గొప్ప నటుడు గురించి పెద్ద స్థాయిలో ఉన్న ఒక నటుడు ఈ విధంగా మాట్లాడటం అనేది మెచ్చుకోవాల్సిన విషయం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -