Megastar Chiranjeevi: నగరానికి దూరంగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 67వ బర్త్ డే ఘనంగా సెలెబ్రేట్ చేసింది మెగా ఫ్యామిలీ. మెగా అల్లు ఫ్యామిలీలు కలిసి ఈ ఈవెంట్‌ను నిర్వహించినట్టుంది. అయితే దీని కారకలు మాత్రం రామ్ చరణ్ ఉపాసన అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సెలెబ్రేషన్స్ జరిగింది దోమకొండ కోటలో. ఎందుకంటే అది ఉపాసనకు చెందినదే. అలా మొత్తానికి చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు మాత్రం దోమకొండ ఫోర్టులో గ్రాండ్‌గా జరిగాయి.

ఈ విషయాన్ని చిరంజీవి చెబుతూ.. ‘ఈ పుట్టిన రోజును(ప్రత్యేకమైన రోజు) నా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా జరుపుకున్నాను. కుటుంబంతో కలిసి గడిపిన ఆ క్షణాలు అద్భుతం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే కటుంబంతో కలిసి సందడి చేసిన ఫొటోలను కూడా చిరు పంచుకున్నాడు. ఇందులో ఆయన భార్య సురేఖ, మెగా, అల్లు కుటుంబానికి చెందిన పలువురు హీరోలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఇక చిరంజీవి 90వ దశకంలో సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ఇదే విషయాన్ని 1992 సెప్టెంబర్ 13న ది వీక్ మ్యాగజైన్ తన సంచికలో చిరు ఒక సినిమాకు రూ. 1.25 కోట్లు భారీ పారితోషికం తీసుకున్నారని వెలువరించింది. దీని మెయిన్‌ పేజీలో బచ్చన్‌ కంటే పెద్ద స్టార్‌ అంటూ పెద్ద అక్షరాలతో ట్యాగ్‌ లైన్‌ ఇచ్చింది. కాగా 1990లో చిరు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సెన్సెషన్ సృష్టించాడు.

కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలు చిరు కెరీర్‏లో బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు కోటికి పైగా పారితోషికం తీసుకుని ఇండియాలోని హీరోల్లో నెంబర్ వన్‌గా మారిపోయాడు.

1

2

3

4

5

6

7

8

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -