Megastar Chiranjeevi: బర్త్ డే రోజు హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కార్మికుల దినోత్సవం రోజున చిత్రపురిలో ఒక హాస్పిటల్ నిర్మిస్తానని మాట ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సినీ కార్మికుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వారి ఆరోగ్య పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని ఈయన హాస్పిటల్ నిర్మిస్తానని కార్మికుల దినోత్సవం రోజున మాట ఇచ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనకు చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించాలని ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని నిరంతరం ఆలోచిస్తున్నానని ఈయన తెలిపారు. చిత్రపురి కాలనీలో 10 పడకల హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని అనుకున్నాను ఇక సినీ కార్మికులు,మధ్యతరగతి కుటుంబీకులు పెద్దపెద్ద హాస్పిటల్స్ కి వెళ్లే పని లేకుండా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను.

ఇలా తనకు వచ్చిన ఆలోచన పంచుకోవడంతో నాకు సహకరించిన నా తమ్ముళ్లు అందరికీ కృతజ్ఞతలు. ఇక పెద్దపెద్ద డాక్టర్లందరూ కూడా నాకు మంచి మిత్రులే వారి సహాయంతో ఇది చేయగలనని నమ్ముతున్నాను అంటూ ఈయన వెల్లడించారు. ఇక ఏడాది నా పుట్టినరోజు హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వచ్చే ఏడాది పుట్టినరోజుకు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తి అవుతుందని ఈ సందర్భంగా ఈయన మాటిచ్చారు.

ఇకపోతే ఈ హాస్పిటల్ తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుపైన నిర్మాణం జరుగుతుందని మెగాస్టార్ వెల్లడించారు. ఇంత మంచి కార్యక్రమంలో ఎవరైనా భాగస్వామ్యం అవుతాం అంటే సంతోషంగా ఆహ్వానిస్తాను లేదంటే నేనొక్కడినే ఈ హాస్పిటల్ నిర్మిస్తాననీ, అంత శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హాస్పిటల్ నిర్మాణం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకున్నాయి.ఇక ఈ హాస్పిటల్ ప్రత్యక్షంగా పరోక్షంగా మా ఎదుగుదలకు కారణమైన వర్కర్లకు ఎంతగానో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి తెలియచేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -