Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పవన్ ను అలా చూడాలనుకున్నారా?

Chiranjeevi: మెగా ఫ్యామిలీ అంటే తెలుగు చిత్ర సీమలో ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది. అందరికంటే ముందు చిరంజీవి వచ్చి జెండా పాతాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్ లేకుండా వచ్చి సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు చిరంజీవి. తన నటనతో అపారమైన అభిమాన గణాన్ని పొంది, మెగా ఫ్యామిలీకి పునాది వేసాడు. ఈ పునాది ఆ తర్వాత వచ్చిన మెగా హీరోలకు సపోర్ట్ గా బాగా ఉపయోగపడింది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోకి వచ్చాడు. అలా మెగా ఫామిలీ నుండి వచ్చిన రెండవ హీరో పవన్.

 

పవర్ స్టార్ గా ఎదిగిన పవన్.
తనదైన శైలి నటన, హావభావాలు, మ్యానరిజం తో అన్నకు సమానమైన పాపులారిటీ సంపాదించగలిగాడు పవన్. అలా ప్రత్యేక గుర్తింపు పొందిన పవన్ పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక టాలీవుడ్ లో పవన్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. తాను ఏ షోకి వచ్చినా, సినిమా రిలీజ్ అయినా ఇక రచ్చరచ్చే. పవన్ అభిమానులందరూ కలిసి పవనిజం అంటూ ఓ ప్రత్యేక గ్రూప్ ఏ మేంటేయిన్ చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా తనదైన పేరు సంపాదించాడు.

 

అయితే పవర్ స్టార్ గా ఎదిగిన పవన్‌ కల్యాణ్‌.. సినిమాల్లోకి రావడం అన్న చిరంజీవికి ఇష్టం లేదట. దీనికి ఒక బలైమన కారణం కూడా ఉందట. పవన్ ముందునుండీ చాలా సైలెంట్‌. పైగా పవన్ వ్యక్తిత్వం ఎప్పుడూ సమాజ సేవ చుట్టూ ఉంటుంది. సినిమాలకు ఆయన తత్త్వం చాలా దూరం. కాబట్టి పవన్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న చిరంజీవి.. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు సెట్‌ కాడేమో అని అనుకున్నాడు. అందుకే పవన్‌ను హీరోగా చేయడానికి చిరంజీవి ఎలాంటి ఆలోచన చేయలేదు.

 

చిరంజీవి భార్య సురేఖ మాత్రం పవన్‌ మంచి స్థాయికి వస్తాడని నమ్మి హీరోను చేయడానికి ప్రయత్నాలు చేసింది. తన కారణంగానే పవన్‌ సినిమాల్లోకి వచ్చాడు. ఇక సినిమాలోకి వచ్చాక పవన్ ఎలా ఇరగదీశాడో అందరికీ తెలుసు. చిరంజీవి అంచనాలను తలకిందులు చేసిన పవన్.. తిరుగులేని స్టార్‌ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా పవన్ నిలిచాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -