Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కొడుకు క్రేజ్ కు షాకవ్వాల్సిందే.. గ్రేట్ అంటూ?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కొడుకు గానే కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి కొడుకులా కాకుండా తనకంటూ ఒక సొంత పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోగా నిలిచాడు రామ్ చరణ్. అయితే రాజమౌళితో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కు ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది.

 

ఆర్ఆర్ఆర్ ముందు రాంచరణ్ కి తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఆర్ఆర్ఆర్ చేసిన మాయ ఏంటో కాని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీనికి చిహ్నంగా ఏకంగా ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్లు వరకు వెళ్ళిపోయింది రామ్ చరణ్ ఎకౌంటు.మన సౌత్ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ 20 మిలియన్ ఫాలోవర్స్ రికార్డ్ రాంచరణ్ ఖాతాలోనే ఉన్నది.

అయితే ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో కేవలం ఇద్దరు ముగ్గురు తెలుగు హీరోలు మాత్రమే ఆ లిమిట్ ని క్రాస్ చేశారు. ఇంక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ లో ఉంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయకగా నటించగా ఈ సంవత్సరమే విడుదల అవబోతుంది.

 

ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానాతో ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. కానీ ఈ సినిమా గురించి అంత ఎక్కువ అప్డేట్స్ ప్రకటించలేదు ఈ చిత్ర బృందం. ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమాలకు ఈ మధ్యకాలంలో ఎలాంటి అప్డేట్లు రాలేదు. సినిమా అప్డేట్ ల కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. గేమ్ చేంజర్ సినిమాలో ఒక పాటని విడుదల చేస్తాను అని ఈ చిత్ర బృందం డిసెంబర్లో చెప్పారు కానీ దాని గురించి ఏ కబురు ఇప్పటి రాకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -