Megastar: టాలీవుడ్ స్టార్స్ కు ఉన్న ఈ సెంటిమెంట్ తెలుసా?

Megastar: సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. కాంబినేషన్లు, ముహూర్తాలు, రిలీజ్ సమయాలను ఎక్కువగా పట్టించుకుంటారు. బాగా ఆడుతుందని నమ్మకంగా పెట్టుకున్న  సినిమా ఫెయిల్ అయ్యిందంటే..  కొన్ని నెలలు, ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా నటనకు హీరోలు దూరంగా ఉంటారు. తర్వాత ఫ్రెష్‌గా సినిమాలు స్టార్ట్ చేసి హిట్‌లు కొడుతుంటారు. తాజాగా ఎన్నో అంచనాలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. దీంతో సెంటిమెంట్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

 

మెగాస్టార్‌ను ఇబ్బంది పెట్టిన పరాజయాలు
మెగాస్టార్ చిరంజీవిని కూడా పాతికేళ్ల కిందట వరుస పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. ఖైదీ లాంటి సూపర్ హిట్ తర్వాత భారీ బడ్జెట్‌తో తీసిన వేట అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మెగాస్టార్ పనైపోయిందనే తరహాలో కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చేవి. ఆ తర్వాత పసివాడి ప్రాణం లాంటి చిత్రంతో ట్రాక్‌లో పడ్డాడు. ఆ తర్వాత హిట్లర్ సినిమాకు ముందు కూడా కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. కొంత గ్యాప్ తీసుకుని తీసిన హిట్లర్ సూపర్ హిట్ అయ్యింది. సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నా కమర్షియల్ అంశాలు సరిగ్గా కుదరడంతో మేకర్స్‌కు కాసుల వర్షం కురిసింది. మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు.

కుర్ర హీరోలకూ ఇలాంటి సెంటిమెంట్లు..
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రిజల్ట్ చూశాక అల్లు అర్జున్ చాలా మధన పడ్డాడు. దీంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అలా వైకుంఠపురములో సూపర్ హిట్‌ అయ్యింది. ఇక రీసెంట్‌గా పుష్ప సినిమా దేశవ్యాప్తంగా చేసిన రచ్చ అంతాఇంతా కాదు. అతిథి తర్వాత ఖలేజా రావడానికి మహేష్ బాబు తీసుకున్న సమయం అక్షరాలా మూడేళ్లు. అలా అని వెంటనే హిట్టొచ్చిందా అంటే లేదు. వేగంగా దూకుడు చేస్తే అది ఇండస్ట్రీ రికార్డులు అందుకుంది. శ్రీనివాస కళ్యాణం మూవీ దెబ్బకు నితిన్ రెండేళ్లు తెరకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత భీష్మతో మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టే అనిపించినా ఇటీవల చెస్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు నిరాశపర్చాయి. దీంతో మరోసారి షూటింగులకు బ్రేక్ చెప్పినట్లు కనిపిస్తోంది. కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు. ఈ లెక్కన కొత్త, పాత తరంతో సంబంధం లేకుండా పరాజయాలు వచ్చాయనే కారణంతో విరామాలు తీసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతున్నదనే విషయం తెలుస్తోంది.

రిజల్ట్ కాదు.. చేసే సినిమాలే ముఖ్యం
ఇక్కడ సీరియస్‌గా చూడాల్సిన కొన్ని విషయాలున్నాయి. చేయబోయే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది మరీ ఎక్కువగా ఆలోచిస్తే కెరీర్ ముందుకెళ్లదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇవాళ కృష్ణ గారి గురించి మూడు వందల పైచిలుకు సినిమాలు చేశారని ఇంత గర్వంగా ఎలా చెప్పుకుంటున్నాం. ఒకే ఏడాదిలో 18 రిలీజులు ఎలా సాధ్యమయ్యాయి? ఫలానా కథ ఖచ్చితంగా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ముందే చెప్పలేనప్పుడు మన వంతు విధిగా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. సినీ కార్మికులు కూడు పూటలా అన్నం తినగలుగుతారు. పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతే తప్ప బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా హిట్ వస్తుందన్న భరోసా ఎవరూ ఇవ్వలేరు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -