Godfather: ఆ భాషలో కూడా విడుదలకానున్న గాడ్ ఫాదర్.. ఇది పెద్ద షాక్ అంటూ ఫ్యాన్స్!

Godfather: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లు కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేసిన తర్వాత ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ కానుంది అని ముందే కన్ఫామ్ చేయగా తాజాగా మరో వర్షన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది చూసిన సినీ ప్రేక్షకులందరికీ మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే..

ఈ సినిమాను మలయాళం లో డబ్ చేస్తూ అక్కడ కూడా రిలీజ్ కన్ఫామ్ చేస్తూ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అయినా లూసిఫర్ మలయాళ సినిమా. అక్కడ నుండి తెలుగులో డబ్ అయిన సినిమానే రీమేక్ చేసి మళ్లీ ఇప్పుడు ఒరిజినల్ వచ్చిన చోటే సినిమాను డబ్ చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తూ ఉండడం చూసి సోషల్ మీడియాలో ఇదేం ట్విస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

చాలావరకు తెలుగు నుండి తమిళ్లో రీమేక్ అయ్యి తిరిగి తెలుగు డబ్ లు రిలీజ్ అయ్యాయి కానీ ఇలా వేరే భాషల సినిమా మన దగ్గర రీమేక్ అవుతూ మళ్లీ అక్కడే డబ్ చేయడం అనేది బహుశా చిరు గాడ్ ఫాదర్ సినిమాకే చెల్లుతుంది అని చెప్పుకోవాలి.

ఇక గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెంచుకొని బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డును కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమా ఒక అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -