Gudivada Amarnath: మంత్రి గుడివాడకు అలాంటి ప్రమాదమా.. అందుకే గన్ లైసెన్స్ కావాలా?

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్లోకి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రౌడీయిజాన్ని మట్టి కరిపించామంటూ పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖలో శాంతిభద్రతలు మంచిగా ఉన్నాయి అంటూ డీజీపీ అమరావతిలో కూర్చుని ప్రకటించారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసినా దిక్కు లేదని విమర్శలు రావడంతోనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అయితే స్వయంగా డీజీపీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎవరికి పెద్దగా ధైర్యం ఇచ్చినట్టు కనిపించడం లేదని తెలుస్తుంది.

 

ఈ క్రమంలోనే కాస్త డబ్బున్న వారందరూ కూడా తమకు లైసెన్స్ కావాలి అంటూ పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు అంటూ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దరఖాస్తులలో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు కూడా లైసెన్స్ గన్ను కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ క్రమంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఈయనకు పెద్ద ఎత్తున ప్రభుత్వం సెక్యూరిటీని నియమించారు అయినప్పటికీ ఈయనకు లైసెన్స్ గన్ను కావాలని భావించారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అదే స్థాయిలో భద్రత ఉన్నటువంటి మంత్రులలో అమర్నాథ్ ఒకరు ఈయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఉంది అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారంలో ఉన్నంతవరకు మాత్రమేనని తాను మంత్రిగా కొనసాగుతున్నంతవరకు మాత్రమే ఉంటాయని అమర్నాథ్ భావించారు.

 

ఈ క్రమంలోనే ప్రభుత్వం మారిపోతే తమకు వేధింపులు అధికంగా ఉంటాయని భావించినటువంటి అమర్నాథ్ ముందుగానే లైసెన్స్ గన్ను కోసం తొందర పడుతున్నారని తెలుస్తుంది. మంత్రి పదవి కాస్త ఊడిపోతే తనను తాను రక్షించుకోవడానికి అసాంఘిక శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించుకోవడానికి గన్ లైసెన్స్ అడిగినట్లుగా చెబుతున్నారు. ఇలా స్వయంగా మంత్రి లైసెన్స్ గన్ను కోసం అప్లై చేయడంతో అక్కడ శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతుందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -