KTR: ఏపీలో జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా.. వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

KTR: తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వరంగల్ లోని మడికొండలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఐటీ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివద్ధి చెందుతోందని ఇంకా వరంగల్ ను అభివృద్ది చేయాలని అన్నారు. అలాగే మరో 10ఏళ్లలో హైదరాబాద్ కు వరంగల్ కు తేడా తెలియనంతగా అభివద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీరు ఏపీలో కూడా ఐటీని డెవలప్ కు సహకరించండీ. జగన్ కు చెప్పి జాగా ఇప్పిస్తా అంటూ మడికొండలోని ఐటీ పార్కులో క్వాడ్రెంట్‌ ఐటీ కంపెనీ నిర్వాహకులకు సూచించారు. ఏపీలోని భీమవరం, ఏలూరు ఎక్కడైనా సరే జగనన్నతో చెప్పి స్థలం ఇచ్చేలా ఏర్పాటు చేస్తాను అని తెలిపారు. ఆ మాటలకు విన్న జనాలు మాటలు కేరింతలతో ఆ ప్రాంగణాన్ని మరింత సందడి సందడిగా చేశారు. హైదరాబాద్ కు వరంగల్ కు కేవలం 160కిలోమీటర్లు ఉందని కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చని బెంగళూరులో 40శాతం మంది తెలుగు రాష్ట్రాల వారు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని వారంతా ఇక్కడకు వచ్చి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు.

అటువంటివారిని ఇక్కడికి వచ్చేలా ఐటీ అభివృద్ధి చెందుతోందన్నారు. అలాగే వరంగల్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మడికొండలోని బంధం చెరువు వద్ద పలు అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్,బస్తీల్లో ఆస్పత్రులకు శంకుస్థాపన చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -