Minister KTR: రూటు మార్చిన మంత్రి కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగి నేతలకు వరుస ఫోన్లు

Minister KTR: ఒకవైపు మునుగోడు ఉపఎన్నికలో గెలుపుపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కూడా ఇప్పటినుంచే కసరత్తు చేస్తోంది. మునుగోడులో గెలవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తమదే మళ్లీ అధికారమనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలనే టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే మునుగోడు ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరిని రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. మునుగోడు ఫలితం ఎలా ఉన్నా.. అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో టీఆర్ఎస్ గెలిస్తే బోనస్ అని చెప్పుకొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

మునుగోడు సంగతి అంటు ఉంచితే.. వచ్చే ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. కసరత్తును షురూ చేసింది. ఎన్నికల వ్యూహలకు మరింత పదునుపెడుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీని విబేధాలు, వర్గ, ఆధిపత్య పోరుపై దృష్టి పెట్టారు. పార్టీలోని విబేధాలను మొన్నటివరకు కేటీఆర్ లైట్ తీసుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో వర్గ విబేధాల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశముండటంతో వాటిని పరిష్కరించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. విబేధాలపై చర్చించేందుకు నేతలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని కేటీఆర్.. ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చారు.

స్వయంగా నేతలు ఫోన్లు చేసి పార్టీలోని విబేధాలపై చర్చిస్తున్నారు. పంతాలు, పట్టింపులు వద్దని, అందరూ కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. గ్రూపు తగాదాలను పక్కనపెట్టి వచ్చే ఎన్నికల్లో మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. నియోజకవర్గంలో ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టాలన్నా.. ఏవైనా సమస్యలు ఉన్నా తనకు నేరుగా చెప్పాలని కేటీఆర్ చెబుతున్నారు. అర్ధికపరమైన ఆంశాల్లో సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని నేతలకు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులపై విషయంపై దృష్టి పెట్టాలని, కాంట్రాక్టుల విషయంలో అవసరమైన సాయం చేస్తామని నేతలకు తెలుపుతున్నారు.

కాంట్రాక్టు బిల్లులు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుుంటాని నేతలకు కేటీఆర్ హామీ ఇచ్చారు. త్వరగా బిల్లులు క్లియర్ అయ్యేలా చూస్తామని తెలిపారు. నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు వదిలేసిన అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి సాయం చేయాలన్నా చేస్తామని నేతలకు కేసీఆర్ హామీలు ఇస్తున్నారు. అయితే కేటీఆర్ ను స్వయంగా ఫోన్ రావడంతో నేతలు ఆశ్చర్యపోతున్నారు. కేటీఆర్ ను కావాలంటే రోజులు తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, ప్రగతిభవన్ కు వెళితే అధికారులు వెనక్కి పంపించేవారని చెబుతున్నారు. కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి ప్రగతిభవన్ చుట్టూ తిరగాల్సి వచ్చేందని అంటున్నారు. కేటీఆర్ కు తమ సమస్యలను చెప్పుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేదని, కానీ ఇప్పుడే ఆయన స్వయంగా ఫోన్ చేయడంతో నేతలు అవాక్కవుతున్నారు.

ఇప్పుడు కేటీఆర్ స్వయంగా ఫోన్లు చేసి స్వయంగా పార్టీ పరిస్థితులు, నియోకవర్గాల సమస్యలు తెలుసుకుంటుండంతో ఎన్నికల సమయంలో కేసీఆర్ మేల్కొన్నాలని అంటున్నారు. పార్టీ సమస్యలు ముదిరిన తర్వాత కేసీఆర్ ఫోన్లు చేసి ఆరా తీస్తే ఏం లాభమని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -