Mallareddy: మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ కు సీన్ లేదంటూ?

Mallareddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు. ఈయన ఏ కార్యక్రమానికి వెళ్లిన ఈయన మాట తీరుతో పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇలా మల్లారెడ్డి ఎన్నో విద్యా సంస్థలకు అధినేత మాత్రమే కాకుండా మంత్రిగా నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే ఒకప్పుడు తాను కూడా పాలు అమ్ముతూ కష్టపడి పైకి వచ్చానని ఎంతోమందికి తన జీవితాన్ని స్ఫూర్తిగా చెబుతూ ఉంటారు.

 

ఇలా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈయన కేవలం రాజకీయ కార్యక్రమాల కోసం మాత్రమే కాకుండా సినిమా వేడుకలలో కూడా సందడి చేస్తున్నారు. ఇలా మంత్రి మల్లారెడ్డి సినిమా వేడుకలలో పాల్గొంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతుంటాయి. అయితే నేడు మే డే కావడంతో ఈయన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన మే డే కార్యక్రమాలలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తెలంగాణ ప్రభుత్వం పనితీరు గురించి కొనియాడారు. మంత్రి కేటీఆర్ కారణంగానే హైదరాబాద్ ఎంతో డెవలప్ అయ్యి హైదరాబాద్ కళకళలాడుతుందని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇక ఒక ఒక రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించే లక్షణాలు కేసీఆర్ లో చాలా ఉన్నాయని మల్లారెడ్డి తెలియజేశారు.ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం కాస్త ప్రస్తుతం బిఆర్ఎస్ ప్రభుత్వం గా మారి అన్ని రాష్ట్రాలలో కూడా తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో మహారాష్ట్రలో తప్పకుండా కేసీఆర్ గారు గెలుస్తారు అంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు.ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే అది కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే అవుతుందని కేసీఆర్ గారు మాత్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలరని ఆ సత్తా ఆయనకు మాత్రమే ఉందంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు.ఇలా ఈయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పోలవరం నిర్మాణం పూర్తిచేసే సీన్ జగన్ కి లేదంటూ పరోక్షంగా ఆయనపై కామెంట్స్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇలా మల్లారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -