Roja: బాలకృష్ణ కి సౌండ్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువ.. రోజా విమర్శలు మరీ హద్దులు దాటుతున్నాయా?

Roja: బాలకృష్ణకి ని పిచ్చోడంటూ పరువు తీసి పారేసిన రోజా. ఇంతకీ ఏం జరిగిందంటే చంద్రబాబునాయుడుని బయటికి తీసుకొస్తాము, న్యాయం కోసం పోరాడుతాము అంటూ బాలకృష్ణ మీటింగ్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ మాటలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రోజా. కన్న తండ్రి దగ్గర మైకు లాక్కొని, ఆయన మీద చెప్పులు వేసి, ఆయనని స్టేజి మీద ఘోరంగా అవమానించినప్పుడు..

ఏమాత్రం పోరాటానికి దిగని ఈ బాలకృష్ణ బావ కళ్ళల్లో ఆనందం కోసం ఏమైనా చేస్తాను అంటున్నాడు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు అతని తను ఒక మానసిక రోగినని, నాలుగు పెద్ద హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పిన ఒక సెల్ఫ్ సర్టిఫైడ్ పిచ్చోడు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణ మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఒక మోసగాడు కుర్చీలో కూర్చున్నాడు, ఇప్పుడు ఒక పిచ్చివాడు కుర్చీలో కూర్చుంటున్నాడు అని ఎద్దేవా చేశారు రోజా.

అలాగే భువనేశ్వరిని కూడా రోజా వదిలిపెట్టలేదు. మా ఆయన చల్లనీటిలో స్నానం చేస్తున్నారు అంటూ ఏదో సింపతి సంపాదించడానికి కబుర్లు చెబుతున్నారు కానీ.. మీ ఆయన ఎంతమంది ఆడవాళ్ళ పసుపు కుంకాలు తుడిచేసాడో, ఎంతమందిని ముంచేసాడో, ఎంతమందికి జీవితాలు లేకుండా చేశాడో అందరికీ తెలిసిందే. అయినా అంతా బాధపడవలసిన అవసరం ఏముంది, చంద్రబాబు నాయుడు ని ఉంచిన ప్లేసులో కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే ఉంచారు,ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొస్తామంటే ఒప్పుకున్నారు.

ఇంటి దగ్గర నుంచే టాబ్లెట్స్ తీసుకొస్తామంటే ఒప్పుకున్నారు. అలాంటిది ఇంటి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తామంటే కూడా ఒప్పుకుంటారు. ఆ మాత్రానికే తెగ బాధ పడిపోతున్నారు, నిజంగా నీ భర్త ఏ పాపము ఎరుగని వాడైతే ఒక సవాలు విసురుతున్నాను.. నిజంగా మీరు నిజాయితీపరులైతే ఆదాయానికి మించిన ఆస్తులకి ఎలాంటి అబ్జక్షన్ పెట్టకండి. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకండి. అప్పుడైనా మిమ్మల్ని జనాలు నమ్ముతారు అంటూ భువనేశ్వరిని సైతం వదిలిపెట్టలేదు రోజా. అయితే ఈ మాటలు విన్న జనాలు రోజా విమర్శలు మరీ హద్దు దాటుతున్నాయి అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -