MLA Padmavathi: సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి….!

MLA Padmavathi: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడం తన బాధ్యతని అన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని చూస్తే తాజాగా జొన్నలగడ్డ పద్మావతి ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. తన నియోజకవర్గంలో ఏ పనులు చేయించుకోవాలన్నా అవ్వడంలేదని అధికారులు నిర్లక్ష్యంతో ప్రతిసారి సీఎం ఆఫీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటూ చెప్పుకొచ్చారు.

 

అయితే దీనిపైన కొందరు రాద్ధాంతం చేస్తూ సీఎం జగన్ కి దీన్ని ఆపాదించి మాట్లాడారని వాపోయారు. నేను కేవలం అధికారులు నిర్లక్ష్యం గురించి మాట్లాడిన తప్ప జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేదని ఆయన నన్ను సొంత చెల్లెల్ల చూసుకున్నారని చెప్పుకొచ్చారు.నేను మాట్లాడింది పార్టీకి, సీఎం జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు ఎమ్మెల్యే పద్మావతి.

మా రాజకీయ భవిష్యత్తు జగన్ తోనే ఉంటుంది. సీఎం జగన్ పై నమ్మకంతోనే అయన వెంట నడుస్తున్నాం. నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు. జిల్లా స్థాయిలో అవ్వాల్సిన పనులు సీఎం ఆఫీస్ వరకూ వెళ్లాల్సి వస్తుందని బాధ తప్ప ఏమీ లేదు. ప్రతిసారీ తాడేపల్లికి రావాల్సి వస్తుందని ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడా. అసలు విషయం తెలుసుకోకుండా రాద్దాంతం చేశారు. ప్రజల కోసం జగన్ చెప్పిన పని చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంత్రి అయిపోవాలనే ఆలోచన ఏదీ లేదు. ఇప్పటికిప్పుడు సీఎం జగన్ నన్ను నువ్వు పక్కన ఉండు అంటే ఆయన నిర్ణయానికి అంగీకరిస్తా” అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తేల్చి చెప్పారు.

 

అయితే పద్మావతి చేసిన వ్యాఖ్యలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది పద్మావతి తాడేపల్లి వెళ్లి జగన్ కి తాను చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి విజన్ ఉన్న నాయకుడు తో తాను జీవితాంతం నడుస్తానని… 2014లో ఆయన్ని కలిసినప్పుడే నా రాజకీయ జీవితం అంతా జగన్ తోనే ఉండాలని ఫిక్స్ అయిపోయినట్లు చెప్పుకొచ్చారు. అయితే జొన్నలగడ్డ పద్మావతి వ్యాఖ్యల వల్ల వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -