PM Modi: దేశం పేరు మార్చేసిన నరేంద్ర మోదీ.. ఇకపై మన దేశం పేరు అలా ఉండబోతుందా?

PM Modi: జీ 20 దేశాధిపతులతో పాటు ముఖ్యమంత్రులకు కూడా సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుని ఏర్పాటు చేశారు. అయితే ఈ విందు లో పాల్గొనడం కోసం వివిధ దేశాల వారికి ఇచ్చిన ఆహ్వాన పత్రికలు చూసిన ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. కేంద్రం మన దేశం యొక్క పేరుని మార్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ సమావేశాల్లో పాల్గొనడం కోసం ఇచ్చిన ఇన్విటేషన్స్ లో ఇండియా ప్లేస్ లో భారత్ అని ముద్రించి ఉంది. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని గురించి ప్రస్తావించాలంటే ఇండియా అనే ప్రస్తావిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. కానీ ద్రౌపతి ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చే విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయటం వివాదాస్పదం అవుతోంది.

సాధారణంగా రాష్ట్రపతి నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని వస్తాయి. అయితే తాజాగా ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఇండియా.. దట్ ఇస్ భారత్ అని మన దేశాన్ని సంబోధిస్తున్నది. అయితే దీనిని భారత్ అనే మార్చటానికి కేంద్ర ప్రభుత్వం కొత్త తీర్మానాన్ని తీసుకురాబోతున్నట్లుగా సమాచారం.

దీనికి సూచన గానే రాష్ట్రపతి భవన్ నుంచి జీ 20 ప్రతినిధులకి అధికారిక సమాచారం లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటం అని అంటున్నారు ప్రతిపక్షాల వారు. ఇప్పుడు ఇదే విషయంగా కాంగ్రెస్ మోదిని తీవ్రంగా విమర్శిస్తుంది. మిగిలిన పార్టీలు కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతున్నాయి. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో ఇండియాని భారత్ అని పిలవాల్సి రావచ్చు అంటున్నారు రాజకీయ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -