KCR-Modi: కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చిన మోదీ.. ఏం జరిగిందంటే?

KCR-Modi: తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన మోదీ. కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంతకీ ఏం జరిగిందంటే వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ భద్రకాళి మహత్యం, సమ్మక్క సారక్క పౌరుషం, రాణి రుద్రమ పరాక్రమం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.

వరంగల్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనలో కూలిపోతుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. కోట్లాది రూపాయలను కొల్లగొడుతుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కన్నేసాయని త్వరలోనే వాళ్ళ పని పడుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగు పనులు మాత్రమే చేస్తుంది.

 

ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను తిట్టడం, కుటుంబ పార్టీని పోషించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం ఇక ఆఖరిగా తెలంగాణను అవినీతిలో కూలికి పోయేలాగా చేయడం ఇవి తప్పితే మరొక పని లేదు తెలంగాణ ప్రభుత్వానికి అని తన ఆవేశాన్ని వెలగక్కారు. కేంద్ర నిధులను గ్రామపంచాయతీలకు అందకుండా చేస్తున్నారని దళితులతో పాటు అన్ని వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది.

 

తెలంగాణకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరం. ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను మోసం చేశారు వేలాది ఖాళీలను భర్తీ చేయకుండా తమాషా చేస్తున్నారు. అలాగే కేంద్రం గత తొమ్మిది ఏళ్లలో గ్రామపంచాయతీలకు ఇచ్చిన లక్ష కోట్లకు పైగా నిధులను పక్కదారి పట్టించారు. ఆదివాసి గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ ద్వారా మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -