Multi Starrer: నందమూరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధం.. డైరెక్టర్ ఎవరంటే?

Multi Starrer: ఎప్పటి నుండో నందమూరి ప్రేక్షకులను ఊరిస్తున్న కోరిక.. అదే “నందమూరి మల్టీస్టారర్ మూవీ”. ఇక ఈ టాపిక్ పై చాలా వేదికలపైనే చర్చ జరిగినా.. ఇప్పటివరకు అఫీషియల్ ఎలాంటి అనౌన్సుమెంట్ ఏమి రాలేదు. కానీ తాజాగా తెలుగు సినీ జనాల్లో జరుగుతున్న చర్చ ఈ మూవీ వైపు అడుగులు పడుతున్నట్టుగా వచ్చే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలం నుండి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ను వెండితెరపై చూడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వీలైనంత త్వరగా మోక్షజ్ఞను సినీ రంగ ప్రవేశం చేయించడానికి ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య బాబు పేరు నిలబెట్టేలా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే సినీ ప్రపంచం వేచిచుస్తుంది.

బాలయ్య తారక్ మోక్షజ్ఞ కాంబో..?
ప్రస్తుతం “నందమూరి భారీ మల్టీస్టారర్” దిశగా అడుగులు పడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలయ్య, తారక్, మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించాలని ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ భావిస్తున్నారు. ఆ కోలీవుడ్ డైరెక్టర్ ప్రత్యేకంగా నందమూరి మల్టీస్టారర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ మల్టీస్టారర్ ద్వారా ఇస్తే బాగుంటుందని కొందరు సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరు నటసింహాలతో పాటు మోక్షజ్ఞ రంగప్రవేశం చేస్తే తెర బద్దలై పోవడం ఖాయం అని బయట జనాలు ముచ్చటాడుతున్నారు. మామూలుగానే బాలయ్య మూవీ అయినా, తారక్ మూవీ అయినా ప్రేక్షకులకు పండగే. అలాంటిది ముగ్గురు నందమూరి హీరోలు ఒకేసారి తెరపై మెరిస్తే ఇక తీన్మార్ దరువే. దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూద్దాం.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -