Nagababu: కళ్యాణ్ దిలీప్ సుంకర పరువు తీసేసిన నాగబాబు.. ఏకంగా అలా వార్నింగ్ ఇవ్వడంతో?

Nagababu: కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి అందరికీ తెలిసిందే ఈయన నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారం చూసిన లాయర్ ఇతనే. అంతేకాకుండా ఇతను వివిధ విషయాలు మీద ముఖ్యంగా వర్తమాన రాజకీయ వ్యవహారాల మీద తనదైన శైలిలో నిత్యం వీడియో కామెంట్స్ చేసే ఎనలిస్ట్. అయితే ఈయన జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి పెద్ద మద్దతు దారు. అయితే ఈయన జనసేన వైపు ఉంటూ జనసేనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కామెంట్లు వినబడుతున్నాయి.

దీనిపై నాగబాబు సైతం తన స్పందన తెలియజేశారు. పరోక్షంగా అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాగబాబు పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే కొందరు పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించినటువంటి ఈయన పరోక్షంగా వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో లేనిపోని గొడవలు పెట్టుకుని పార్టీకి నష్టం తీసుకువచ్చే వారి పట్ల ఉపేక్షించేది లేదు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు జనసేన, తెదేపా పార్టీల పొత్తు కుదిరింది కాబట్టి పార్టీ శ్రేణులు అందరూ కూడా ఏకమయ్యారు. కానీ కొంతమంది మాత్రం పార్టీ ముసుగులో ఉంటూ వేరే పార్టీలకు మంచి చేస్తూ సొంత పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఇన్ డైరెక్ట్ గా కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి మాట్లాడాడు నాగబాబు.

నిజానికి దిలీప్ సుంకర కి మహాసేన రాజేష్ కి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. వాటిని పార్టీకి అంటించేసి రచ్చ చేస్తున్నారు దిలీప్ సుంకర. దీనివలన పార్టీకి నష్టం కలుగుతుంది అన్నది జనసేన వర్గాల అభిప్రాయం. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సుంకరను చేర తీయలేదు. సుంకర మాత్రము తాను జనసేన కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు చేస్తూ పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరిస్తూ ఉంటారు. పార్టీని తన అవసరాలకి అనుగుణంగా వాడుకుంటున్నారు. అయితే నాగబాబు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -