Niharika Konidela: నాగబాబు కూతురు నిహారిక ఏకంగా అన్ని కోట్ల ఆస్తులకు అధిపతా?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు ఈమె మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అని చెప్పాలి.చదువులు మొత్తం పూర్తి చేసుకున్న నిహారిక బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బుల్లితెరపై తన మాట తీరుతో అందరిని సందడి చేసిన ఈమె అనంతరం ఒక మనసు సినిమా ద్వారా వెండితెరపై హీరోయిన్గా పరిచయమయ్యారు. ఇలా మెగా ఆడపడుచు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావడానికి మెగా అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.

ఇలా ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.నిహారిక ఇండస్ట్రీలో సరైన స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో ఈమె తన కుటుంబ సభ్యులు చూసినటువంటి సంబంధాన్ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇలా పెళ్లి తర్వాత కూడా సినిమాలపై ఆసక్తి తగ్గకపోవడంతో ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు.

ఇలా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఈమె భారీగానే సంపాదించారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాదులో ఈమె ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా యాంకర్ గా ప్రారంభమైన తన ప్రస్థానం నటిగా నిర్మాతగా కొనసాగుతూ వచ్చారు. మరి ఇండస్ట్రీలో కొనసాగుతూ నిహారిక ఎంత మొత్తంలో ఆస్తులు కూడా పెట్టింది అనే విషయానికి వస్తే… పలు నివేదికల ప్రకారం 2020 నాటికి నిహారిక ఆస్తులు విలువ నాలుగు మిలియన్ డాలర్లని తెలుస్తుంది.

మన భారత కరెన్సీ ప్రకారం ఈమె ఆస్తుల విలువసుమారు 30 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ అని తెలుస్తుంది. అయితే ఇప్పటికి ఈమె ఆస్తులు విలువ మరింత రెట్టింపు అయి ఉంటుందని చెప్పాలి.ఇలా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టారు. ఇకపోతే నిహారిక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని ఈమె తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు కూడా వినపడుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -