Nagarjuna-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం సొంత తమ్ముడిని వదిలేసిన నాగార్జున.. షాకింగ్ విషయాలు రివీల్!

Nagarjuna-Pawan Kalyan:  తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కింగ్ నాగార్జునకి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ చాలా ఆప్యాయతగా ఉంటారు. నాగార్జున చిరంజీవితో ఈక్వల్ స్టార్ట్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా అన్నయ్య అనే పిలుస్తాడు. చిరంజీవి కూడా నాగార్జునని తన సొంత తమ్ముడిలాగే చూస్తారు.

నాగార్జున చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ ని కూడా ఒకరోజు బిగ్ బాస్ కి వచ్చినప్పుడు నా అన్నయ్య కొడుకు రామ్ చరణ్ అనే పరిచయం చేశాడు. నాగార్జున పిల్లలు నాగచైతన్య, అఖిల్ కూడా రామ్ చరణ్ ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా వరుసలు పెట్టే పిలుస్తారు. అయితే నాగార్జునకి పవన్ కళ్యాణ్ తో అంత బంధం ఉన్నట్టు మనకి ఎక్కడా వార్తలు రాలేదు.

కానీ వీరిద్దరి బంధం గురించి ఒక విషయం ఈమధ్య తెలిసింది. నాగార్జున పవన్ కళ్యాణ్ కోసం తన తమ్ముడిని వదులుకున్నారట. తమ్ముడు అంటే తన సొంత తమ్ముడు కాదు. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ తో తన కొత్త చిత్రానికి తమ్ముడు అనే పేరుని రిజిస్టర్ చేసుకున్నారట అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన రాబోయే సినిమాకి తమ్ముడు అనే టైటిలే ఆప్ట్ గా ఉన్నది అని నాగార్జునని రిక్వెస్ట్ చేశారు.

క్షణం కూడా ఆలోచించకుండా నాగార్జున ఆ టైటిల్ ని పవన్ కళ్యాణ్ కి ఇచ్చేసారట. దీన్ని బట్టి తెలుస్తుంది నాగార్జునకి మెగా ఫ్యామిలీ సభ్యులు అంటే ఎంత ప్రేమ ఉందో. ఇదే కాకుండా ఏ ఈవెంట్ లోనైనా స్టేజ్ మీద నాగార్జున మెగా ఫ్యామిలీ వాళ్ళని పొగుడుతూనే ఉంటారు. ఏ రక్త సంబంధం లేకపోయినా సరే ఈ రెండు కుటుంబాల మధ్య బంధం ఎప్పుడు బలంగానే ఉంటుంది. ఒకరికొకరు ఎప్పుడు ప్రేమానురాగాలని పంచుతూనే ఉంటారు. దీని వల్లే మన టాలీవుడ్ యునైటెడ్ గా మారుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -