Alekhya Reddy: అలేఖ్యా రెడ్డికి నందమూరి ఫ్యామిలీ ఈ రేంజ్ లో షాక్ ఇచ్చిందా?

Alekhya Reddy: నందమూరి వంశంలో ఇటీవలె తారకరత్న మరణం అందర్నీ బాధించింది. నందమూరి కుటుంబంతో పాటుగా సినీలోకంలో కూడా విషాదం అలముకుంది. ఫిబ్రవరి 18న తారకరత్న తుదిశ్వాస విడిచారు. తారకరత్న లేడనే విషయం తెలిసి ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ కన్నీటి సంద్రంలోనే ఉంది. తన భర్తతో అలేఖ్య రెడ్డి గడిపిన క్షణాలను మరచిపోలేక తల్లడిల్లుతోంది.

 

కుటుంబ సభ్యులు, సన్నిహితులు అలేఖ్యను ఎంత ఓదార్చినా అలేఖ్య కళ్ల వెంట కన్నీరు మాత్రం ఆగడం లేదు. అయితే అలేఖ్య రెడ్డితో పెళ్లి తారకరత్న తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదని అందరికీ తెలుసు. అలేఖ్య కోసం తారకరత్న తల్లిదండ్రుల నుంచి విడిగా వచ్చేశారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు తారకరత్నను పట్టించుకోవడం లేదు.

అయితే తారకరత్నకు బాబాయ్ బాలయ్య అండగా నిలిచారు. ఓ వైపు సినిమాలు లేకపోయినా మరో వైపు తల్లిదండ్రులు దూరం పెట్టినా తారకరత్నను బాలయ్య ఆదరిస్తూ వచ్చారు. తారకరత్న చివరి రోజుల్లో కూడా బాలయ్య పడిన తపన గురించి అందరికీ తెలుసు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులు తారకరత్నకు చికిత్స జరుగుతుండగా ఆయన వెంటే ఉండి బాలయ్య కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేశారు.

 

తారకరత్నను కాపాడుకునేందుకు బాలయ్య అనేక ప్రయత్నాలు చేశారు. స్పెషల్ కేర్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెల్లిపోయారు. తారకరత్న మరణం తర్వాత బాలయ్య చాలా ఎమోషనల్ అయ్యారు. బాల బాబాయ్ అంటూ బాలయ్యను తారకరత్న పిలిచేవారు. ఇకపై ఆ పిలుపు వినపడదని బాలయ్య కన్నీటిపర్యంతమయ్యారు.

 

తాజాగా తారకరత్న ఆస్తుల గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తారకరత్న ఆస్తులను అలేఖ్యకు ఇచ్చే ఉద్దేశంలో నందమూరి తారకరత్న తల్లిదండ్రులు లేరని తెలుస్తోంది. అయితే బాలయ్య మాత్రం ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి నుంచి అలేఖ్య రెడ్డికి సపోర్ట్ గా నిలుస్తున్న బాలయ్య ఈ విషయంలో కూడా అండగా నిలిచాడని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -