Taraka Ratna Wife Alekhya: తారకరత్న భార్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

Taraka Ratna Wife Alekhya:ఏపీలో గత కొద్ది రోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యే నేటికీ 24 రోజులు అవుతోంది. టీడీపీ నేతలు ఆయన బెయిల్ కోసం ఆయన బయటకు తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా ఫలించడం లేదు. బాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

ఎన్నడూ లేని విధంగా నందమూరి ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ విషయంపై స్పందించడం అంతేకాకుండా నారా బ్రహ్మిని, నారా భువనేశ్వరి, తారకరత్న భార్య అఖిల కూతురు లాంటివారు రోడ్డుపై ఎక్కడ నిరసన చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నారా, నందమూరి కుటుంబాలు దీక్షలు చేపట్టాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చేస్తున్న దీక్షల్లో దివంగత తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిష్క పాల్లొన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికొచ్చే వరకు కుటుంబ సభ్యులుగా తాము చేయాల్సిందంతా చేస్తామన్నారు. ఈ సందర్భంగా అలేఖ్య మీడియాతో.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని మేము ఖండిస్తున్నాము.

నా భర్త తారకరత్న బ్రతికున్న సమయంలో ఆయన టీడీపీ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమం ఉన్న వారు పిలిచినప్పుడు తప్పనిసరిగా వెళ్లేవారు. మా ఆయనకు తాతయ్య అంటే చాలా ప్రాణం. టిడిపి పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అన్నా ఇబ్బందులు ఎదురైనా ముందు ఉండేవారు. ఒకవేళ ఆయన ఎప్పుడూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించడంతోపాటు ఆయన కోసం నిలబడేవారు. కానీ ఆయన లేరు కాబట్టి ఆయన స్థానాన్ని నేను భర్తీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడుతూనే ఉంటాము. ఆయన బయటకు వచ్చే వరకు ఈ పోరాటం ఆపము అని తెలిపారు అలేఖ్య.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -