Nandamuri Family: తారక్ ఆ కోరికను నెరవేర్చుకుంటారా?

Nandamuri Family: నందమూరి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి మూడు తరాల వారు వచ్చారు. అటు సినిమాల్లోను, ఇటు రాజకీయాల్లోను రాణిస్తున్నారు. ఇకపోతే అన్న హరికృష్ణ, తమ్ముడు బాలకృష్ణలు కూడా ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నారు. అయితే తాత పోలికలు పునికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో హీరోగా ఉంటూ ఆ మధ్య ఒకసారి టీడీపీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన తాత స్థాపించిన పార్టీ కోసం ఎప్పుడూ కష్టపడుతానని గతంలో ఎన్టీఆర్ తెలిపాడు.

 

తెలుగుదేశం పార్టీ తరుపున తారక్ 2009లో ప్రచారం చేసినా కూడా ఆ తర్వాత ఎందుకో టీడీపీ అధిష్టానం తారక్ ను దూరం పెడుతూ వస్తోంది. ఆ తదుపరి వచ్చిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందింది. కేవలం 23 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. అయితే ఆ పరాజయంతో టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని కార్యకర్తలు కూడా ఒక కొలిక్కి వచ్చేశారు. కష్టాల్లో ఉన్న టీడీపీ పార్టీని దారుణమైన స్థితి నుండి బయటపడేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఆశాకిరణంగా మారతాడని అందరూ అనుకున్నారు.

 

భవిష్యత్ లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని ఆయన అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లో కూడా తాను సీఎం కావాలనే అభిలాష ఎంతగానో ఉంది. ఫ్యాన్స్ కూడా ఇటీవలె కొన్ని ఈవెంట్లలో తారక్ వేదికపైకి రాగానే ‘సీఎం సీఎం’ అనే నినాదాలతో హుషారెత్తిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 20 ఏళ్ల క్రితమే ఎప్పటికైనా తాను సీఎం అవుతానని నమ్మకంగా చెప్పేవాడని పలువురు చర్చించుకుంటున్నారు.

 

రాజకీయంగా ఇప్పుడు సైలెంటుగా ఉంటున్న ఎన్టీఆర్ మరి అభిమానుల కోరిక మేరకు త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. రాజకీయాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నా రాజకీయాలపై తారక్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే అవకాశం వస్తే ఎప్పటికైనా ఏపీకి సీఎం కావాలని జూనియర్ ఎన్టీఆర్ కోరిక అని సమాచారం. మంచి వాగ్ధాటి అయిన తారక్ ఆ కోరికను నెరవేర్చుకుంటారేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -