Nara Brahmani: ప్రజల్లోకి రానున్న బాలయ్య కూతురు బ్రాహ్మణి.. 2024లో సీఎం అయ్యేది ఎన్టీఆర్ మనవరాలేనా?

Nara Brahmani:  ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దానికి తోడు తాజాగా పవన్ కళ్యాణ్ ని కూడా అడ్డుకోవడంతో పాటు లోకేష్ ని కూడా అరెస్టు చేస్తారు అంటూ వార్తలు వినిపిస్తుండడంతో అటు జనసేన రైతులు ఇది టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే రోడ్లపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజల్లోకి నారా భువనేశ్వరి అలాగే నారా బ్రాహ్మణులు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్‌లపై వేధింపులకు పాల్పడుతున్నారని తప్పుడు కేసులో కావాలనే ఇరికించి వేధిస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఇప్పటికే ఒక కార్యాచరణ సిద్ధమయిందని చెబుతున్నారు. నారా లోకేష్ పైనా సీఐడీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని పరోక్షంగా చెప్పారు. ప్రతిపక్ష నేతల అరెస్టులు, వారిపై కక్ష సాధిస్తున్నారని ప్రజలు అనుకునే వ్యవహారాలను ఎన్నికలకు ఏడాది ముందు ప్రభుత్వాలు చేయవు.

రాజకీయాల్లో పండిపోయిన అందరికీ సానుభూతి ని మించిన అస్త్రం ఉండదని తెలిసి వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన సానుభూతి వెల్లువలో వైఎస్ జగన్ తడిచి ముద్దయ్యారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఒక్క చాన్స్ అని వేడుకున్నారని ఆ సానుభూతే కనిపించింది కానీ టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండి ఇక ప్రతిపక్ష నేతలపై వేధింపులు అంటూ వారి కుటుంబసభ్యులు రోడ్డెక్కితే వచ్చే సానుభూతి వెల్లువ ఊహించడం కష్టమే అని చెప్పవచ్చు.

ముఖ్యంగా మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే ఫలితాలు పూర్తి స్థాయిలో ఏకపక్షమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి తన కోసం పని చేసిన, పాదయాత్రలు ప్రచారాలు చేసిన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలను దూరం చేసుకున్నారు. అది కూడా చర్చకు పెట్టే అంశాలపై టీడీపీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ వార్తలపై మరింత క్లారిటీ రావాలి అంటే ఇంకా కొద్ది సమయం వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -