Narendra Modi: ప్రధాని మోదీ సొంత ఇలాఖాలో పంజాబ్ తరహా ప్లాన్.. గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి ఎవరంటే..?

Narendra Modi: దేశవ్యాప్తంగా మరో ఏడాదిన్నరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే దేశంలో జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలపై దేశ రాజకీయాల్లో అసక్తి నెలకొంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడం, ఆ రాష్ట్ర సీఎంగా మోదీ మూడుసార్లు వరుసగా పని చేయడంతో.. గుజరాత్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆప్ కూడా ఈ సారి బలంగా పోటీ ఇవ్వనుంది. దీంతో గుజరాల్ ఎన్నికలు మరింత రసవత్తరంగా జరుగుతున్నాయి.

 

ఈ నెల 3వ తేదీన గుజరాత్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీలన్నీ గుజరాత్ లో మరింత స్పీడ్ పెంచాయి. గుజరాత్ మరోసారి అధికారంలో తమదేనని చెబుతుండగా.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చాలామంది ఇతర పార్టీలలో చేరడం అక్కడ ఆ పార్టీ బలహీనపడింది. ఇక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలహీనంగా లేకపోవవడంతో అక్కడ బీజేపీకి ఎదుర్కొవడడం కాంగ్రెస్ కు కష్టంగా మారింది. దీంత కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసి ప్రతిపక్ష స్థానాన్ని అయినా సంపాదించుకునేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది.

 

ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుని ఆప్.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఢీకొట్టి ఊహించని విధంగా అధికారాన్ని సొంతం చేసుకుంది. దీంతో పంజాబ్ ఊపుతో దేశవ్యాప్తంగా బలపడేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగా గుజరాత్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్ వ్యూహలు రచిస్తోంది. అందులో భాగంగా గతంలో పంజాబ్ లో అనుసరించిన వ్యూహన్నే గుజరాత్ లో ఆప్ అమలు చేస్తోంది. గతంలో గుజరాత్ ఎన్నికల్లో టెలిఫోన్ సర్వే నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం సీఎం అభ్యర్థిని ఆప్ నిర్ణయించింది. టెలిఫోన్ సర్వే ద్వారా ప్రజల నుంచి వచ్చి ఫీడ్ బ్యాక్ ప్రకారం పంజాబ్ లో సీఎం అభ్యర్ధిగా భగవంత్ సింగ్ మూన్ ను ప్రకటించింది.

 

ఇప్పుడు పంజాబ్ ప్లాన్ నే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ అమలు చేస్తోంది. సీఎం అభ్యర్ధి ఎవరనే దానిపై టెలిఫోన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. అనంతరం ప్రజల నుంచి వచ్చిన మెజార్టీ అభిప్రాయాల ప్రకారం ఇసుదాన్ గఢ్వీని నియమించింది. అయితే పంజాబ్ సీఎం భగవంత్ మూన్ కూడా గతంలో టీవీ యాంకర్ గా పనిచేయగా.. ఇప్పుడు గుజరాత్ సీఎం అభ్యర్ధి ప్రకటించిన గఢ్వీ కూడా టీవీ యాంకర్ గా పనిచేయడం విశేషం. సీఎం అభ్యర్ధిపై ఆప్ నిర్వహించిన సర్వేలో గఢ్వీకి 73 శాతం ఓట్లు వచ్చాయి.

 

గఢ్వీ గుజరాత్ లోని ద్వారక జిల్లా పిపాలియా గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. గుజరాత్ లో ఓటర్లు ఎక్కువగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. గుజరాత్ లో ప్రజల్లో మంచి పేరున్న టీవీ జర్నలిస్టు యాంకర్ గా ఆయన ఉన్నారు. గఢ్వీ వయస్సు 40 ఏళ్లు కాగా.. గత ఏడాది ఆయన ఆప్ లో చేరారు. సీఎం అభ్యర్ధి ఎంపిక కోసం ఓ ఫోన్ నెంబర్ ను ఆప్ ఏర్పాటు చేసింది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కోరింది. ప్రజల నుంచి వచ్చి న అభిప్రాయాల ప్రకారం ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటే వారిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది.

 

గఢ్వీకి ఎక్కువగా ప్రజల నుంచి మద్దతు లభించడంతో ఆయనను సీఎం అభ్యర్ధిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ ఆప్ వల్ల కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశముంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సంబంధించి కాంగ్రెస్ కు ఎక్కువగా వెళ్లకుండా ఆప్ చీలిక తీసుకురానుంది. దీని వల్ల ఆప్ ప్రభావంతో గుజరాత్ లో కాంగ్రెస్ కు ఓట్ల శాతం తగ్గనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ లో కూడా కాంగ్రస్ ను ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఆప్ ఏ రాష్ట్రాల్లో అయితే బలంగా ఉందో అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఆప్ కు వెళుతున్నాయి.

 

ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓట్లకు ఆప్ గండి కొట్టనుందని, దీని వల్ల కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరగనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పంజాబ్ ప్లాన్ నే గుజరాత్ లో ఆప్ అమలు చేస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే సీఎం అభ్యర్ధిగా అవకాశం ఇవ్వడంపై గఢ్వీ ఆనందం వ్యక్తం చేశారు. రైతు బిడ్డగా ఉన్న తనకు సీఎం అభ్యర్ధిగా అవకాశం కల్పించారని, ఇది ఊహించని విషయం అని అన్నారు. కేజ్రీవాల్ చాలా పెద్ద బాధ్యతలు అప్పగించారని, తను చేయగలిగినంత చేస్తానని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -