Kethireddy: కేతిరెడ్డి ఇసుక మాఫియాకు సంబంధించి ఇంతకు మించి ప్రూఫ్ కావాలా?

Kethireddy: టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రస్తుతం యువగలం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర పై మొదట్లో వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. కానీ నారా లోకేష్ చేస్తున్న సవాళ్లకు మాత్రం సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటున్నారు. మొన్నటికి మొన్న యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ధర్మవరం నియోజకవర్గం ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ధర్మవరం ఎమ్మెల్యే అయినా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న అక్రమాలు అవినీతి ఇసుక మాఫియా లాంటి వాటిని ఫోటోలు సాక్షాదారాలతో సహా చూపించి నిలదీశారు.

లోకేష్ అడిగిన ప్రశ్నలకు కేతిరెడ్డి సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోలేక తడబడ్డారు. ఇప్పుడు నారా లోకేష్‌ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏవిదంగా ఇసుక దోపిడీ చేస్తున్నారో సెల్ఫీతో చూపించారు. అబ్బాయ్ కేతిరెడ్డి క‌బ్జాలు ధ‌ర్మ‌వ‌రంలో చూశాం.. తాడిప‌త్రిలో బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో అబ్బాయ్‌ని మించిపోయాడు. పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ ఇది. ఇసుక తవ్వకాలకు 10 ఎకరాలు కేటాయిస్తే, ప‌దింత‌ల విస్తీర్ణంలో త‌వ్వ‌కాల‌కి బరితెగించారు.

 

ప్రతి రోజు ఈ రీచ్ నుండి సుమారుగా 150 టిప్పర్ల ఇసుక తరలిస్తోంది బాబాయ్ గ్యాంగ్‌. నేను వ‌స్తున్నాన‌ని తెలిసి రెండు రోజుల క్రితమే రీచ్ బంద్ చేసినా, ఇసుక మాఫియా విధ్వంసం ఆన‌వాళ్లు అలాగే ఉన్నాయి అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్. తాజాగా అయినా తాడిపత్రి లో పాదయాత్ర చేతుండగా దారిలో టిడిపి అభిమానులు ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ బ్యానర్ వద్ద నారా లోకేష్ ఆగి సెల్ఫీ దిగి దానిని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చిత్రపటంతో ఉన్న ఆ బ్యానర్‌లో వీటిలో ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ ఏది? 1. పులివెందుల? 2. అమరావతి? 3. కర్నూల్? 4. వైజాగ్? కనుగొన్నవారికి రూ.1,00,000/- శ్రీ నారా లోకేష్‌ గారి చేతుల మీదుగా బహుమతి అందించబడును పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇసుక మాఫియా గురించి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదని నారా లోకేష్‌ సవాళ్ళకు వైసీపీ నేతలు ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -