Roja Daughter: మంత్రి రోజా కూతురి లేటెస్ట్ వీడియోపై అలాంటి కామెంట్లు.. ఆమెకు చెల్లి దొరికిందంటూ?

Roja Daughter: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒకప్పటి సీనియర్ నటి మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రోజా ఆ తర్వాత దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు అన్షుమాలిక, రోహన్ అనే కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఇక కూతురు అన్షుమాలిక ఆమె చేస్తున్న మంచి పనుల గురించి ఆమె గొప్పతనం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిన్నతనంలోనే ఎన్నో అవార్డులను అందుకొని తల్లికి మించిన కూతురు అనిపించుకుంది. పేద పిల్లలను హక్కున చేర్చుకొని వారికి ఉచితంగా విద్యను కూడా అందిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అన్షుమాలిక తన బర్త్ డే సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.. తన 20వ బర్త్ డే సందర్భంగా ఆమె ఒక వీడియోలో మాట్లాడుతూ.. చిన్నప్పుడూ బర్త్ డే అంటే పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. అయితే ఇప్పుడు 20 బర్త్ మరో కొన్ని గంటల్లో వస్తుండడంతో చాలా నర్వస్‌గా, ఎంగ్జైటీగా ఉందని చెప్పుకొచ్చింది.

అన్షు మాలిక చూసిన నెటిజన్స్ ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ పై కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో మాట్లాడోచ్చుగా అని కొందరూ కామెంట్స్ పెట్టగా మరికొంత మంది మంచు లక్ష్మికి చెల్లెలు దొరికిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం అన్షు మాలిక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. కానీ కొందరు మాత్రం అన్షుమాలిక కు బర్త్డే విషెస్ చెబుతూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అన్షుమాలిక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో ఒక వర్గం ప్రేక్షకులు పనిగట్టుకొని మరి ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -