Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను అవమానించిన నెట్ ఫ్లిక్స్?

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులు పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఇకపోతే ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ఆయన నటించిన బిల్లా సినిమాను విడుదల చేశారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ పుట్టినరోజును పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇక ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ సైతం ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినప్పటికీ అభిమానులు మాత్రం నెట్ ఫ్లిక్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ రానాని చంపేటప్పుడు పెద్ద బండరాయి తీసుకొని తనపై వేసే ఫోటోని నెట్ ఫ్లిక్స్ ఎడిట్ చేస్తూ ఆ రాయికి బదులు పెద్ద కేక్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున నెట్ ఫ్లిక్స్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నెట్ ఫ్లిక్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ను కించపరిచే విధంగానే ఇలాంటి ఫోటో ఎడిట్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఎక్కువగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి మద్దతు తెలుపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీల ఆనందం కోసం ప్రభాస్ ఫోటోని ఇలా ఎడిట్ చేసింది అంటూ ఎంతో మండిపడుతున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నెట్ ఫ్లిక్స్ ఒక హీరో పట్ల ఇలా వ్యవహరించడం ఏంటి అంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Prabhas-Sreeleela: ప్రభాస్, శ్రీలీల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమేనా?

Prabhas-Sreeleela:  పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి శ్రీ లీల. ఇలా మొదటి సినిమాతోనే తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం రవితేజ...
- Advertisement -
- Advertisement -