Galatta Geetu Royal: గలాట గీతూని భరించలేకపోతున్నామంటున్న ప్రేక్షకులు.. కారణం ఇదే!

Galatta Geetu Royal: సాధారణంగా మనుషులకు చాలా భిన్నంగా ఆలోచనలు, అలవాట్లు ఉంటాయి. అలాంటి ఆలోచనలు, అలవాట్లు ఎవరికివారు ఒంటరిగా ఉన్నప్పుడు.. తమ ఇష్టాలను, ఆలోచనలను కొనసాగించుకోవాలి. అంతే గాని ఎక్కడపడితే అక్కడ సాగిస్తే అవి చూసేవారికి రోతగా అనిపిస్తాయి. నేనింతే నా యాటిట్యూడ్ ఇంతే నేను ఇంట్లో లాగే బయట కూడా ఉంటాను అంటే చెల్లదు.

అంతేకాకుండా ఎదుటివారికి చాలా ఎగుటుగా అనిపిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గీతూ వ్యవహారం కూడా అలాగే అనిపిస్తుంది. రోజురోజుకీ చూసేవారికి కంపరంగా అనిపిస్తుంది. గలాటు గీతూగా సోషల్ మీడియా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం హౌస్ లో నానా రకాల రచ్చ చేస్తుంది. ఇక హౌస్ లో ఉన్న వారికే కాకుండా.. ప్రేక్షకులకు కూడా చాలా చిరాకు పుట్టించే విధంగా ప్రవర్తిస్తుంది.

పెద్దగా హౌస్ లో అరుస్తూ నాకు నేనే కరెక్ట్ అన్నట్లుగా హౌస్ లో వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ విధంగా తనకు తానే గొప్పగా ఫీల్ అవుతుంది. ఇక అందరూ తాము చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని ఊహించుకుంటూ ఉంటారు. ఇక హౌస్ లో సభ్యులు కూడా గీతూని వరస్ట్ పర్ఫామెర్ గా హౌస్ లో వేరు చేశారు. ఇక స్కూల్లో కూడా నేను ఇదే విధంగా ప్రవర్తించేదానిని అని గీతూ చెప్పింది.

మొత్తానికి గీతూ హౌస్ లో డైలీ ఏదో ఒక విధంగా రచ్చ చేస్తుంది. రోజురోజుకీ ప్రేక్షకులు కూడా గీతూ ను తట్టుకోవడం మావల్ల కాదని అంటున్నారు. ఇక ఈమె ఏం చేసిందంటే టాస్క్ లో భాగంగా తాళాన్ని టీ షర్ట్ లో వేసుకుంది. ఇలా చేయడం కరెక్ట్ కాదంటే.. నేను ఇలాగే చేస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని బోల్డ్ గా వ్యవహరించింది. మరి చూసి కంపలో ఎవరు కాలు వేస్తారు. అందుకని ఆమె యాటిట్యూడ్ కి తగ్గట్టు సైలెంట్ గా ఉంటున్నారు. ఇక ఇదే విధంగా గీతూ ప్రవర్తిస్తే హౌస్ లో కొంతకాలం ఉంటుందో ఊడుతుందో తెలియడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -