Adipurush: కార్టూన్ సినిమాకు రూ.500 కోట్లు .. ఆదిపురుష్ పై ట్రోల్స్ మమూలుగా లేవుగా?

Adipurush: సినీ ప్రియులకు రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది పురుష్ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిసన్నాడు. ప్రభాస్, కృతి సనన్, హేమమాలిని, సైప్ అలీ ఖాన్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. మరి టీజర్ ను చూశాక ప్రేక్షకులకు సినిమాపై మరింత అంచనాలు పెరగాలి కానీ.. ఈ సినిమా పై ఒక రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా నీళ్లలో మునిగేటప్పుడు వాళ్ళ ఒంటి మీద లేక నడుముకు ఉన్న నూలు వస్త్రాలు పైకి తెలుతాయి. మరి తాజాగా విడుదలైన ఆది పురుష్ టీజర్ లో రాముడు పూర్తిగా నీలల్లో మునిగిపోయి తన నడుం మీద నూలు పంచెతో యజ్ఞం చేస్తూ ఉంటాడు.

మరి అలా యజ్ఞం చేసేటప్పుడు రాముడు తన నడుముకి ధరించుకొని ఉన్నది నూలు వస్త్రం. మరి ఈ వస్త్రం ఎందుకు నీళ్లలో తేలలేదు దీన్ని పూర్తిగా ఫిజిక్స్ కి విరుద్ధంగా చేశారు సదరు డైరెక్టర్. వందల కోట్లు పెట్టి సినిమాలు తీయడమే కాదు కొంచెం ఇలాంటి వాటిని గమనించాలని ఈ టీజర్ చూసిన కొందరు అనుకుంటున్నారు. మరికొందరు కార్టూన్ సినిమా అయితే ఇలాంటి తప్పులు ఎన్ని ఉన్నా కానీ పట్టించుకోము.. కార్టూన్ కదా అని లైట్ తీసుకుంటాము.

కానీ పెద్ద పాన్ ఇండియా స్టార్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు ఒక సినిమాను తీసుకు వచ్చేటప్పుడు భారీ స్థాయిలో బడ్జెట్ తో ప్లాన్ చేస్తారు. మరి అలా భారీ స్థాయిలో నిర్మించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాటులు చేస్తే ఆ స్టార్ కి ఉన్న విలువ పోతుందని మరికొందరు వార్తలు గుప్పిస్తున్నారు. కొందరు ఈ సినిమా కార్టూన్ సినిమాల అనిపిస్తుంది.. 500 కోట్లు ఖర్చుపెట్టి కార్టూన్ సినిమా తీశారంటూ నెట్టింట్లో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -