Sankranti Movies: సంక్రాంతి సినిమాలపై న్యూట్రల్ ఫ్యాన్స్ కోరిక ఇదే.. విజేతగా నిలుస్తాడా?

Sankranti Movies: సంక్రాంతి అంటేనే పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు మధ్యలో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించినటువంటి నటుడు తేజ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా నటించినటువంటి హనుమాన్ సినిమా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది.

 

సాధారణంగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిన్న సినిమాలను ఇండస్ట్రీలో చాలా సునాయసంగా తొక్కేస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ ఫిలిం సిండికేట్ లో పెద్ద ఎత్తున ఇలాంటి మాఫియాలు జరుగుతున్నాయని కేవలం నలుగురు వాళ్ళే ప్రొడ్యూసర్లు వాళ్లే డిస్ట్రిబ్యూటర్లు వాళ్లే థియేటర్ ఓనర్స్ కావడంతో ఇలాంటి చిన్న సినిమాలను వాళ్ళు అనుకుంటే తొక్కేయడం చాలా సులభం ఇలా ఈ మాఫియాకు భయపడి చాలామంది ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

ఇక నిర్మాతలు పరోక్షంగా ఈ సినిమాని వాయిదా వేసుకోవాలని హనుమాన్ చిత్ర బృందానికి చెబుతూ ఉన్నప్పటికీ హనుమాన్ చిత్ర బృందం మాత్రం మొండిగా నిలబడి సంక్రాంతి బరిలో దిగుతున్నారు దీంతో సంక్రాంతి బరిలో రాబోతున్నటువంటి సినిమాల విషయంలో అందరికీ అంచనాలు ఉన్నాయి కానీ న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం హనుమాన్ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

 

ఇలా ఒక చిన్న సినిమాని ఇంతగా థియేటర్లో లేకుండా హింసిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని పాన్ ఇండియా స్థాయిలో కూడా హిట్ అయితే మాడిపోయిన ఆ సిండికేట్ మొహాలను చూడాలని ఉంది అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. హనుమాన్ తో ఆటలు వద్దని మరికొందరు కూడా ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. అయితే హనుమాన్ సినిమాకు మాత్రం భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ సంక్రాంతి బరిలో హనుమాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -