Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కు సరికొత్త టెన్షన్.. ఏమైందంటే?

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ఇటీవలే సలార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. కనీసం సినిమాను అఫీషియల్ గా కూడా లాంచ్ చేయలేదు. కానీ అప్పుడే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

 

ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. కాగా తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. మారుతీ – ప్రభాస్ కాంబినేషన్ మూవీకి రాజా సాబ్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. పోస్టర్లో టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా కూల్గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడూ లేనివిధంగా ఫుల్ పవర్ఫుల్ లుక్ లో కనిపించారు ప్రభాస్. డార్లింగ్ హెయిర్ స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. లాంగ్ హెయిర్ తో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రాజా సాబ్ టైటిల్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అలా వచ్చిందో లేదో ఇంతలోనే సోషల్ మీడియాలో సరికొత్త డౌట్స్ మొదలయ్యాయి. సినిమా టైటిల్ విషయంలో పలువురు నెటిజన్స్ లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ టైటిల్ తో ఈ టైటిల్ ని పోలుస్తున్నారు. Rajasaab టైటిల్ షార్ట్ ఫామ్ RS అని వస్తుంది. అలాగే రాధే శ్యామ్ టైటిల్ కి షార్ట్ ఫామ్ కూడా RS అనే వస్తుంది. రెండు సినిమాల షార్ట్ ఫామ్స్ సేమ్ ఉన్నాయంటే రాధే శ్యామ్ లాగే రాజా సాబ్ కూడా ప్రభాస్ కెరియర్ లో ప్లాప్ మూవీ అవుతుందా? అంటూ ఒక వర్గం ప్రేక్షకులు పిచ్చిపిచ్చి డౌట్లతో లేనిపోని అనుమానాలను క్రియేట్ చేస్తున్నారు. అంటూ కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఫన్నీ మీమ్స్ అండ్ వీడియోస్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ అవ్వడంతో డార్లింగ్ అభిమానులు కొందరు మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -