Nagababu: నిహారిక మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా.. నాగబాబు పెట్టిన షరతులు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nagababu: నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఆమధ్య అంతా విడాకుల విషయంలో వార్తల్లో ఉండగా.. ఇప్పుడు మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుంటుందంటూ వార్తల్లోకి ఎక్కింది నాగబాబు ముద్దుల కూతురు నిహారిక. ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెద్దలు కుదిర్చిన వివాహం ద్వారా పెళ్లి చేసుకొని ఏడాదిన్నర తరువాత భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తుంది.

ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలలో, వెబ్ సిరీస్లలో చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన పలు రకాల పోస్టులను తన అభిమానులతో నిత్యం షేర్ చేసుకుంటూనే ఉంటుంది నిహారిక. ఈ నేపథ్యంలోనే ఆమె రెండో పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.

 

ఇప్పటికే నిహారిక ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా జోరుగా వార్తలు వినబడుతున్నాయి. త్వరలో అతనితో ఏడు అడుగులు వేయడానికి రెడీ అయిందట మెగా డాటర్. అయితే నాగబాబు మాత్రం ఈసారి నిహారిక పెళ్లి విషయంలో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడట. మొదటి పెళ్లిలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

నిహారిక ప్రేమించిన వ్యక్తిని ఇంటికి రప్పించి భవిష్యత్తు గురించి అతనితో మాట్లాడడట నాగబాబు. గొడవలు రాకుండా ఇద్దరూ చూసుకుంటారా.. జీవితంలో వచ్చే ఎలాంటి ఇబ్బందులు నైనా ఫేస్ చేయడానికి మీరు రెడీయే కదా అంటూ ఇద్దరినీ ప్రశ్నించాడంట నాగబాబు. వీటన్నింటికీ ఒప్పుకుంటానంటేనే రెండో పెళ్లికి ఒప్పుకుంటానంటూ కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఈ వార్తలు ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -