YS Jagan: జగన్ ఒంటరి వాడయ్యాడా.. ఆయన తరపున ప్రచారం చేసే వ్యక్తులే లేరా?

YS Jagan: గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కోసం పని చేయడానికి పెద్ద సైన్యమే రంగంలోకి దిగింది. కానీ.. ఇప్పుడు వైసీపీ కోసం ఆయన ఒక్కరే ప్రచారం చేసుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఆయన నిర్వహిస్తున్న బస్సు యాత్రను ప్రతీ మూడు రోజులకు ఒకసారి బ్రేక్ ఇస్తున్నారు. గతంలో జగన్ కు వ్యవస్థలు బాగా కలిసి వచ్చాయి. అధికారులను బాగా వాడుకున్నారు. అప్పటి సీఎస్, ఎన్నికల సంఘం అధికారులు కూడా జగన్ కు అనుకూలంగా పని చేశారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ఐదేళ్లు అదే అధికారులను జగన్ పీడించి పిప్పి చేశారు. దీంతో.. నిమ్మగడ్డ రమేష్, ఎల్వీ సుబ్రహ్మణ్యం లాంటివారు ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయంగా ఒంటరివాడు అయ్యారు. బీజేపీ పొత్తు తెగిపోయింది. పవన్ సింగిల్‌గా పోటీ చేశారు. సో.. చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంటరి పోరు చేశారు. ఇప్పుడు జగన్ ది అదే పరిస్థితి.. కాదు కాదు.. అంతకంటే దారుణమైన పరిస్థితి. చంద్రబాబు గత ఎన్నికల్లో రాజకీయంగా మాత్రమే ఒంటిరివాడు అయ్యారు. కానీ.. జగన్ ఈ ఎన్నికల్లో రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఒంటివాడుగా మిగిలారు. ఐదేళ్లు తిరిగేసరిగి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

గత ఎన్నికల్లో జగన్ కు పరోక్షంగా సహకరించిన బీజేపీ.. ఈసారి సైలంట్‌గా ఉంది. జనంలో విపరీమైన వ్యతిరేకత వచ్చింది. పార్టీ మారడానికి చాలా మందినేతలు అదునుకోసం ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. కుటుంబ కలహాలే జగన్ కు పెద్ద సమస్యగా మారాయి. ఈ కుటుంబ కలహాల నుంచి తప్పించుకొని ఈ ఎన్నికలను నెట్టుకొని రావడం అంత సులభంగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కొడుకు కోసం ప్రచారం చేసిన తల్లి విజయమ్మ.. ఎక్కడున్నారో ఎక్కడ లేరో తెలియడం లేదు. బైబై బాబు అంటూ బుస్సు యాత్ర చేసిన జగన్ గెలుపులో ఎంతో కొంత పాత్ర పోషించిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి వైసీపీనే గురిపెడుతున్నారు. గతంలో ఓవైపు నుంచి జగన్, మరోవైపు నుంచి షర్మిల ప్రచారంలో దూసుకుపోయేవారు. అటు, ప్రత్యేక్షంగా కాకపోయినా.. జగన్ గెలుపు కోసం వైఎస్ సునీత కూడా గత ఎన్నికల్లో తనదైన ఉడతసాయం అందించారు. జగన్ కోసం కాకపోయినా.. తన తండ్రి వివేకానందరెడ్డి హత్యకేసులో నిజాలు తేలాలి అంటే అన్న సీఎం అవ్వాలి అని భావించారు. కానీ.. ఇప్పుడు ఆమె కూడా రివర్స్ అయ్యారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరడమే జగన్ కు అతిపెద్ద సమస్యగా మారింది. షర్మిల ప్రచారం మొత్తం జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా జరుగుతోంది. షర్మిల ఈ ఎన్నికల్లో ఏం సాధిస్తారో తెలియదు కానీ.. అన్న ఓటమికి ప్రధాన కారణమవుతారనడంలో అనుమానం లేదు. షర్మిలకు సునీత, సౌభాగ్యమ్మ కూడా మద్దతు ఇస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల కోసం సునీత ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్యకేసు, కోడికత్తి కేసులను వాడుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అవే కేసులు జగన్ మెడకు చుట్టుకొని వైసీపీ ఓటమికి కారణమయ్యేలా ఉన్నాయి. షర్మిల, సునీత మాత్రమే కాదు.. వైఎస్ బంధుగణం మొత్తం జగన్ కు దూరమయ్యారు. దీనికి కారణం వివేకాహత్య కేసు. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడటానికి జగన్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అదే ఆయన కొంపముంచింది. తన అనుకున్నవారిని దూరం చేసింది. రాజకీయంగా ఒంటరి అయితే.. అవే రాజకీయ పరిస్థితులు రేపు అనుకూలంగా మారొచ్చు. కానీ, తన అనుకున్నవారిని దూరం చేసుకుంటే ఇప్పట్లో రాజకీయ భవిష్యత్ ఉండదు. ఎందుకంటే… సొంతవారికే న్యాయం చేయన వ్యక్తి మనకు ఏం న్యాయం చేస్తాడనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -