YCP: దేవుడి రాతను ఎవరూ మార్చలేరుగా.. బెయిల్ పై వైసీపీ ఏం చేస్తుందో?

YCP: గత ఎన్నికల్లో ఏ అంశాలు అయితే.. జగన్ కు అస్త్రాలుగా మారాయో ఇప్పుడు అవే అంశాలు అడ్డుపుల్లలుగా మారుతున్నాయి. జగన్ ప్రతీ సారి చెబుతున్నట్టు నిజంగానే దేవుడు బలేగా స్క్రిప్ట్ రాస్తాడు అనిపిస్తుంది. ఐదేళ్లుగా జైలులో మగ్గిపోతున్న దళిత యువకుడు కోడికత్తి శ్రీనుకు ఇవాళ బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. 25 వేల రూపాయల విలువ గల రెండు పూచీకత్తులు, ప్రతీ ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడొద్దని షరతు విధించింది.

 

అయితే.. కోడికత్తి శ్రీను కొత్తగా మీడియాతో మాట్లాడాల్సిన పని లేదు. కేసు వివరాలు, శ్రీనుకు జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలిసిందే. ఐదేళ్లుగా శ్రీను ఎంత అన్యాయానికి గురైయ్యాడో ఎవరూ గుర్తించలేనిది కాదు. 2018లో ప్రతిపక్షనేత పాదయాత్ర చేస్తున్న టైంలో జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఈ దాడి చేసిన కోడికత్తి శ్రీను జైలుకు వెళ్లారు. ఆతర్వాత జగన్ కు ఇదే ఎన్నికల అస్త్రంగా మారింది. జగన్ పై విపరీతమైన సింపతీ పెరిగింది. ఈ దాడి చేయించింది చంద్రబాబు, లోకేష్ అని వైసీపీ ఊరూరా ప్రచారం చేసింది. దీని ఫలితంగా వైసీపీ కనీవినీ ఎరుగని మెజార్టీ సాధించి గత ఎన్నికల్లో విజయం సాధించింది.

అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై దాడి చేసింది కోడికత్తి శ్రీను అయినప్పటికీ… దాడి చేయించింది ఎవరు అని విచారణ చేయించాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుంది. కానీ.. జగన్ అలా చేయలేదు. ఈకేసు నాన్చుతూ వచ్చారు. విచారణను సాగదీస్తున్నారనే అనుమానాలు కూడా జగన్ పై ఉన్నాయి. దీంతో.. ఈ దాడిలో పాత్రదారి శ్రీనే అయినప్పటకీ.. సూత్రధారి జగనేనని అనుమానాలు మొదలైయ్యాయి. టీడీపీ కూడా ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతూ వచ్చింది. ఫైనల్ గా కోర్టు ఐదేళ్ల తర్వాత శ్రీనుకు బెయిల్ ముంజూరు చేసింది. ఐదేళ్లు జైల్లో మగ్గిపోయిన శ్రీను.. మీడియాకు కాకపోయినా.. తన అనుకున్న వాళ్ల దగ్గర తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పకుండా ఉంటారా? ఎంతైనా.. నిజం ఎన్నాళ్లు దాగి ఉంటుంది? అసలే ఎన్నికల సమయం కనుక.. నిజానిజాలు ఏంటి అనేది బయటకు వస్తాయి.

 

జగన్ ప్రభుత్వ చిత్తశుద్దిపై కూడా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓ దళిత యువకుడిని అతికిరాతకంగా చంపి శవాన్ని ఇంటికి పార్సిల్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకి 6 నెలల్లో బెయిల్ వచ్చింది. కానీ, చిన్నగాయం చేసిన దళిత యువకుడు శ్రీనుకు ఐదేళ్లు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. దీనిపై ప్రజలు ఆలోచించడం మానేస్తారా? కోర్టు ఆదేశించినట్టు కోడికత్తి శ్రీను మీడియాతో మాట్లాడకపోయినా.. ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటారు. ఇదేకాదు.. గత ఎన్నికల్లో జగన్‌కు అనుకూలంగా ఉన్న వైఎస్ వివేకాహత్య కేసు కూడా ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారింది. చిన్నాన్నను హత్య చేయించింది చంద్రబాబే అని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన జగన్.. ఇప్పుడు ఆ హత్య కేసు నిందితులను కాపాడుతున్నారని అపవాదు మూటగట్టుకున్నారు. కాబట్టి.. నాడు అస్త్రాలే ఇవాళ జగన్ కు అడ్డుపుల్లలు అయ్యాయి. పైగా యాత్ర2 రిలీజ్ రోజునే.. కోడికత్తి శ్రీను విడుదల కావడాన్ని టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. దేవుడు స్క్రిప్ట్ బలేగా రాశాడు అని.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -