Government Orders: జీవోలకు విలువ లేకుండా ఐదేళ్ల జగన్ పాలన.. డబ్బులు చెల్లించకుండా జీవోలిచ్చి లాభమేంటో?

Government Orders: జోవో అంటే గవర్నమెంట్ ఆర్డర్.. దీనికి చట్టానికి ఉన్నంత బలం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ జీవోలకు విలువే లేకుండా పోయింది. వైసీపీ హయాంలో వందల జీవోలు, వేల కొద్ది ఆదేశాలు. కానీ, ప్రతీదీ చిత్తు కాగితంతో సమానం. అసలు జీవో అంటే ఎవరీకి లెక్కే లేదు. ప్రజలకు ఎలాగూ నమ్మకం పోయింది. చివరికి పార్టీ నేతలు కూడా హో జీవో నా? అవి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. అనుకునే పరిస్తితి.

ఎందుకంటే.. జగన్ ప్రభుత్వంలో విడుదలైన వేలాది జీవోల్లో అమలైనవి వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మిగిలినవి అన్నీ చెత్త బెట్టలో పడ్డవే. జగన్ సీఎం అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పటి వరకూ అమలు కానివే ఎక్కువ ఉన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. తొలి క్యాబినెట్‌లో వందకు పైగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతీ నిర్ణయానికి ఓ జీవో. కానీ, ఆ జీవోలు ఏమయ్యాయో తెలియదు. అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారో కూడా కేబినెట్ మంత్రులకు కూడా తెలియదు. వైసీపీ హయంలో జీవోలకు, ఆర్ఢినెన్సులకు అంత విలువ.

అమరావతి రైతులకు కౌలు చెల్లించడానికి జోవో ఇచ్చారు. కానీ డబ్బులు రాలేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిందే ప్రయోజనాలపై జీవోలు ఇచ్చారు. కానీ, అవి అమలు కావు. ఇంకా ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. మాకు ఇచ్చిన హామీ సంగతి ఏంటీ అని ఎవరైనా అడిగితే.. జీవో ఇచ్చాం ప్రాసెస్ లో ఉంది అంటారు. పని కావాల్సిన వాళ్లు ఎదురు చూడటం తప్పా చేసేదేమీ లేదు.

ప్రభుత్వం హామీలను ఎగ్గొట్టడానికి జీవోలను ఎంచుకున్నట్టు ఉంది. జీవో ఇచ్చామంటే హామీ నెరవేరిపోయిందని అనుకుంటారు. ప్రజలు నిలదీస్తే జీవో ఇచ్చాం కాస్తా టైం పడుతుందని అంటారు. లబ్దిదారులకు మాత్రమే తెలుస్తుంది అది అమలు అయ్యిందో లేదో.. మిగిలిన వారికి జీవో వచ్చిందంటే పని అయిపోయిందని అనుకుంటారు. కానీ, లబ్ధిదారులకు ఓపిక నశించి.. పనికాదని గ్రహించి కోర్టులకు వెళ్తే.. అక్కడ కూడా అదే సమాధానం. జీవో ఇచ్చాం ప్రాసెస్ జరుగుతుందని చెబుతారు. దానికి కోర్టులు కూడా చేసేదేమీ ఉండదు. కోర్టులు సీరియస్ అయ్యే లోపు ఐదేళ్లు కాలం గడిచిపోతుంది.

అలా అని జగన్ ప్రభుత్వంలో అసలు పనులే అవ్వవా అంటే అదేం లేదు. మన అనుకున్న వారికి జీవోల అవసరమే లేకుండా పని చేసేస్తారు. రుషికొండ ప్యాలస్ ముప్పై ఏళ్లకు ఎవరికైనా లీజుకు ఇచ్చేయాలి అనుకుంటే ఇచ్చేస్తారు. పని అయిపోయిన తర్వాత తీరిగ్గా జీవో ఇస్తారు. అది కూడా రహస్యంగా ఉంచుతారు. భూములు తాకట్టు పెట్టాలంటే.. తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఖర్చు అయిపోయిన తర్వాత నెమ్మదిగా జీఓ ఇస్తారు. ఎంతవరకు ఎందుకు ప్రత్యర్థుల ఆస్తులను వివాదాల్లోకి తీసుకురావాలంటే జీవోల కంటే పనులు ముందు అవుతాయి. ఆ తర్వాత జీవోలు వస్తాయి. అశోక్ గజపతిరాజుకి చెందిన మానసాస్ ట్రస్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇలాంటివి చాలానే జరుగుతాయి. వైసీపీ ప్రభుత్వం చెప్పిందే రూల్. రాసిందే చట్టం అన్నట్టు తయారైంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -