Sr NTR: ఇండస్ట్రీలో అతని స్నేహం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఎన్టీఆర్?

Sr NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి రాకముందు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగారు. ఎలాంటి పాత్రలో నైనా ఎంతో అవలీలగా నటించే ఎన్టీ రామారావు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇదే అదునుగా భావించి రాజకీయాలలోకి వచ్చారు.ఇలా రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఈయన పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక రాజకీయ నాయకుడిగా సినీ హీరోగా అన్నగారు ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో విజయవాడకు చెందిన నటుడు కస్తూరి శివారావు అనే వ్యక్తి అప్పటికే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈయన విజయవాడకు చెందిన వ్యక్తి కావడంతో ఎన్టీఆర్ తరచూ తనను కలసి తనతో మాట్లాడుతూ ఉండేవారు.ఇక ఎన్టీఆర్ నటించిన సినిమాల విషయాల గురించి ఆయనతో ప్రస్తావించడం తన ఆశీర్వాదం తీసుకొని సినిమాలలో నటించడం జరుగుతుండేది.

ఈ విధంగా ఎన్టీఆర్ కస్తూరి శివారావును ఎంతో నమ్మారు అయితే శివారావు ఏమాత్రం పొదుపు లేకుండా తాను సినిమాలలో సంపాదించిన డబ్బు మొత్తం ఇలా తెలిసిన వారి కోసం ఖర్చు చేయడం అలాగే ఎవరైనా డబ్బులు బాగా సంపాదిస్తే వారిని తన వెంట తిప్పుకొని వారితో డబ్బు ఖర్చు చేయించే అలవాటు ఉంది. ముఖ్యంగా ఇతనికి హార్స్ రైడింగ్ వ్యసనం బాగా ఉండేదట.

ఈ క్రమంలోనే ఒకరోజు ఎన్టీఆర్ ని కూడా హార్స్ రైడింగ్ రేస్ కోసం తీసుకెళ్లారు. అయితే బలవంతంగా ఎన్టీఆర్ ఈ రేసులో పాల్గొన్నప్పటికీ మొదటి రెండు రౌండ్లు ఎన్టీఆర్ కి బాగా డబ్బులు రావడంతో ఈయన కూడా ఉత్సాహంగా వచ్చిన డబ్బు మొత్తం రేస్ లో పెట్టి చివరికి ఉన్న డబ్బును కాస్త పోగొట్టుకున్నారు.ఇలా ఆయనను నమ్మి అప్పట్లో తన దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకోవడమే కాకుండా కొద్దిరోజుల పాటు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారట.ఇక అప్పటినుంచి అన్నగారు కస్తూరి శివారావును దూరం పెడుతూ వచ్చారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -