Chandrababu: చంద్రబాబు వేసిన స్కెచ్ తో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి.. ఆయన రాజకీయాల ఆలోచన గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబంకు అండగా ఉంటూనే వారికి వెన్నుపోటు పొడిచి రాజకీయంలో తన హవా చూపిస్తున్నాడు. గతంలో ఈయన చేసిన మోసాలు చాలా వరకు బయటపడ్డాయి.

 

అయితే ఇదంతా పక్కన పెడితే.. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తను ముఖ్యమంత్రి కావడానికి ఒక పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ను తనకు ఆసరాగా వాడుకోవాలి అని చూస్తున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజుల నుండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి అడుగుపెడుతున్నాడు అని.. తెలుగుదేశం పార్టీ తరఫున ఓ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నాడు అని జోరుగా వార్తలు వినిపించాయి.

కానీ ఈ విషయం గురించి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. రీసెంట్ గా ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్లు ద్వారా.. చంద్రబాబు ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో అడుగు పెట్టినప్పుడు అతనిని ఎవరు పట్టించుకోలేదు అని.. ఎలాంటి సపోర్టు కూడా ఇవ్వలేదు అని.. సక్సెస్ అయ్యాక చంద్రబాబు అతన్ని ఎలా వాడుకోవాలా అని చూడటం మొదలుపెట్టాడు అని అన్నాడు పోసాని.

 

సీనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన భార్య బసవతారకం మరణించారని.. ఆ సమయంలో లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ కు అండగా ఉండేందుకు వివాహం చేస్తుందని.. అలాంటి మహిళను పట్టుకొని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వాళ్లు నోటికొచ్చినట్లు తిట్టారు అని.. అదే హరికృష్ణ రెండో భార్య, జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినిని తిట్టే ధైర్యం వాళ్లకు లేదు అని.. ఎందుకంటే అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడు అని అన్నాడు.

 

అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని తన కుటుంబ సభ్యులతోనే నాన హింస పెట్టించి మానసికంగా చంపించాడు.. ఇక రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్ అసలైన వారసులను ఎదగనివ్వలేదు.. అలా జూనియర్ ఎన్టీఆర్ ని కూడా దూరం పెట్టి ఇప్పుడు సక్సెస్ అవ్వగానే.. జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పుడు ఎలా వాడుకొని వదలాలి అని చంద్రబాబు స్కెచ్ వేస్తున్నట్లు తెలియడంతో.. నందమూరి అభిమానులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -