NTR: ఎన్టీఆర్ ను అలా చూడటానికి కృష్ణంరాజు ఇష్టపడేవాడట!

NTR: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు అనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ నమ్మలేని స్థితిలో ఉంది. సినీ, రాజకీయ వర్గాలు కృష్ణంరాజు మరణ వార్త విని ఒకసారిగా మూగపోయాయి. కృష్ణంరాజు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్, కృష్ణంరాజుల మధ్య స్నేహం ఎలా ఉండేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎన్టీఆర్ మొదటిసారిగా కృష్ణుడు గెటప్ వేసినప్పుడు కృష్ణంరాజు ఎన్టీఆర్ ను కలుసుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ ను కృష్ణుడి వేషంలో చూడడం కృష్ణంరాజుకు చాలా ఇష్టమట. ఇక ఎన్టీఆర్ కృష్ణంరాజుపై చూపించిన ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని కృష్ణంరాజు గతంలో తెలిపాడు. అప్పట్లో ఎన్టీఆర్ తను నటించే సినిమాల్లో ఏవైనా పాత్రలు ఉంటే కృష్ణంరాజుకి ఇప్పించేవాడట. ఆ విధంగా ఎన్టీఆర్ కృష్ణంరాజులు జతకట్టి పలు సినిమాల్లో నటించారు.

ఎన్టీఆర్ తర్వాత కొన్ని పాత్రలకు కృష్ణంరాజు యాక్టర్ గా బాగా మెప్పిస్తాడని అప్పటి దర్శకులు రచయితలు అనుకునేవారట. ఆ విధంగా బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో కృష్ణంరాజు తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అనంతరం తాండ్రపాపారాయుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి పాత్రలో కృష్ణంరాజు నటించి తన పాత్రను మరో స్థాయిలో పండించేవాడు. ఇక తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు ఎన్టీఆర్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు.

ఆ క్రమంలో ఎన్టీఆర్.. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే ప్రజల ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది అని ఎన్టీఆర్ కృష్ణంరాజుకి చెప్పాడట. అలా ఎన్టీఆర్ ఇచ్చిన సలహాల మేరకు రాజకీయాల్లో అడుగుపెట్టిన కృష్ణంరాజు ఇంతవరకు ఎటువంటి కాంట్రవర్సీలకు కారణం అవలేదు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు సేవలందించి మచ్చ లేకుండా బ్రతికాడు కృష్ణంరాజు. మరి అటువంటి మహానీయుడు ఇప్పుడు చనిపోవడం తెలుగు ప్రజలకు అంతు పట్టని విధంగా ఉంది. ఇక సినీ ఇండస్ట్రీకి మాత్రం కృష్ణంరాజు లాంటి నటుడు తిరిగి రాడని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -