Shaukaru Janaki: ఎన్టీఆర్ రెండో పెళ్లి గురించి అసలు నిజం చెప్పిన షావుకారు జానకి!

Shaukaru Janaki: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వాళ్లు సెలబ్రిటీలు కావడంతో వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది అభిమానులు ఆసక్తి కనపరుస్తుంటారు.అయితే కొన్ని విషయాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు స్థానం ఎలాంటిదో మనకు తెలిసిందే.

ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఎన్టీఆర్ గురించి నటి షావుకారు జానకి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షావుకారు జానకి సీనియర్ ఎన్టీఆర్, కృష్ణకుమారి ప్రేమ విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం కన్నా ఎన్టీఆర్ బసవతారకం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అప్పటికే వీరికి 11మంది సంతానం కూడా కలరు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన షావుకారు జానకి ఎన్టీఆర్ కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న సమయానికి తనకు పెళ్లి అయ్యి 11 మంది పిల్లలు ఉన్నారు ఒకవేళ కృష్ణకుమారిని కనుక ఎన్టీఆర్ రెండవ పెళ్లి చేసుకుని ఉంటే తనకు ఈ పెళ్లి అంత శ్రేయస్కారంగా ఉండేది కాదేమో అంటూ షావుకారు జానకి ఈ సందర్భంగా వారి ప్రేమ రెండవ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక కృష్ణకుమారికి షావుకారు జానకి స్వయాన అక్క అవుతారు. ఇలా ఈమె వారి మధ్య ఉన్న ప్రేమ గురించి బయటపెట్టారు.

ఇలా పెళ్లి చేసుకోవాలనుకున్న వీరిద్దరూ గొడవపడ్డారో విడిపోయారో తెలియదు కానీ వీరిద్దరి వివాహం ఆగిపోయింది.ఇక కృష్ణకుమారి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో కేవలం ఒకే ఒక్క ఫోన్ తనకు రావడం చేత తాను కమిట్ అయిన 14 సినిమాలను క్యాన్సిల్ చేసుకుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన కృష్ణకుమారి చివరికి ఓ సీనియర్ జర్నలిస్ట్‌ అజయ్‌ మోహన్‌ కైఠాన్‌ను పెళ్లి చేసుకుందనీ ఈమె వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -