Jr NTR: ఆ పని చేస్తే వైఎస్ఆర్ స్థాయి పెరగదు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

Jr NTR: తెలుగు రాష్ట్రాల ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా వెలుగుతూ పాన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ యూనివర్సిటీ పేరు మార్చడానికి గతంలో మంత్రివర్గం కూడా ఆమోదించింది. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ విషయంపై ప్రస్తుతం వ్యతిరేకాలు వస్తున్నాయి. టీడీపీ సపోర్టర్స్, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని పూర్తిగా వెతికిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు.

ఎన్టీఆర్, వైయస్సార్ లు ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించుకున్న గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని కూడా తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తి, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరు. అంటూ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ కు ఎన్టీఆర్ అభిమానులు మరో స్థాయిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా యూనివర్సిటీ కు ఎన్టీఆర్ పేరు తీసేసి వైయస్సార్ పేరు పెట్టడం ఎన్టీఆర్ అభిమానులు ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు. మరి ఈ విషయం గురించి ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. అంతేకాకుండా బాలయ్య స్పందన గురించి వేచి చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -