Sharmila: పులి కడుపున పులే పుడుతుంది.. షర్మిల కామెంట్స్ వైరల్!

Sharmila: వైయస్ షర్మిల.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఏ ముహూర్తన షర్మిల ఏపీ రాజకీయలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ అప్పటి నుంచి వైసీపీకి వణుకు మొదలైంది. అంతేకాకుండా ఆమె పేరు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ప్రతిసారి ఆమెను వైసిపి నే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. అలా అని టీడీపీ జనసేన వదిలేయకుండా వాటికి వాటిపై కూడా విమర్శలు గుప్పిస్తోంది. అన్న జగన్ మోహన్ రెడ్డిని, ఆయన చేసిన అభివృద్ధి గురించి పదే పదే ప్రశ్నిస్తోంది. షర్మిల వేసే ప్రశ్నలకు వైసీపీ నేతలు కూడా నోరు మెదపలేకపోతున్నారు.

 

తాజాగా మరోసారి షర్మిల వ్యాఖ్యలు చేసింది. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్‌ పాలనకు చాలా తేడా ఉంది అని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్ పాలనకు జగన్‌ పాలనకు భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. జలయజ్ఞంపై వైఎస్‌ఆర్‌ ఎంతో దృష్టి పెట్టారు. ఆయన 17 శాతం నిధులిస్తే జగన్‌ 2.5 శాతమే ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాజధాని, ప్రత్యేక హోదా లేదు.

ఉన్నవన్నీ అప్పులే. ఒక్క సీటూ లేని భాజపా రాష్ట్రాన్ని శాసిస్తోంది. ఆ పార్టీకి వైకాపా నేతలు కట్టుబానిసలు. స్వలాభం కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారు. 25 మంది ఎంపీలున్నా తెచ్చింది గుండు సున్నా. పులి కడుపున పులే పుడుతుంది.. నాది వైఎస్‌ఆర్‌ రక్తం. ఎవరు అవునన్నా.. కాదన్నా నేను వైఎస్‌ షర్మిలారెడ్డినే అంటూ షర్మిల వ్యాఖ్యానించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -